Chiranjeevi: అంజనీ పుత్రుడికి అయోధ్య నుంచి పిలుపు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై చిరంజీవి ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తారు. ఆయనే కాదు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ హనుమంతుడిని పూజిస్తారు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి తల్లి పేరు అంజనా దేవి. అందుకే అభిమానులు కూడా చిరంజీవిని అంజనీ పుత్రుడు అని పిలుస్తుంటారు

Chiranjeevi: అంజనీ పుత్రుడికి అయోధ్య నుంచి పిలుపు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై చిరంజీవి ఏమన్నారంటే?
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2024 | 4:24 PM

మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తారు. ఆయనే కాదు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ హనుమంతుడిని పూజిస్తారు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి తల్లి పేరు అంజనా దేవి. అందుకే అభిమానులు కూడా చిరంజీవిని అంజనీ పుత్రుడు అని పిలుస్తుంటారు. అలాంటి అంజనీ పుత్రుడికి అయోధ్య నుంచి పిలుపు అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం వచ్చింది. ఈ విషయాన్ని హనుమాన్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లోనే వెల్లడించారు చిరంజీవి. అయితే ఇప్పుడు ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. విశ్వహిందూ పరిషత్ జాతీయనేత గుర్రం సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశిధర్ రావినూతల చిరంజీవికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు.

ఈ ఆహ్వానంపై చిరంజీవి మాట్లాడుతూ.. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం, రఘురాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనేవి కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపం. ఇలాంటి ఒక చారిత్రాత్మక మహా క్రతువులో పాలుపంచుకోవడం నేను చేసుకున్న గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మహాక్రతువుకు నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి, సురేఖతో  పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందింది.  అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గణ్, అలియా భట్, రణ్  బీర్ కపూర్ లకు కూడా ఆహ్వానం అందింది.  జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరగనుంది. దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  ఇందుకోసం శ్రీరామ జన్మభూతి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందజేస్తోంది.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ దంపతులకు కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి