Guntur Kaaram 2nd Day Collections: ఇదెక్కడి క్రేజ్ సామీ.. ‘గుంటూరు కారం’ రెండ్రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

అల వైకుంఠపురంలో హిట్ తర్వాత గురూజీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటున్న ఈ సినిమా అటు భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. తొలి రోజే రూ.94 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Guntur Kaaram 2nd Day Collections: ఇదెక్కడి క్రేజ్ సామీ.. 'గుంటూరు కారం' రెండ్రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
Guntur Kaaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2024 | 4:07 PM

సంక్రాంతి పండక్కి మహేష్ అభిమానులకు గుంటూరు కారం సినిమాతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అందించాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అల వైకుంఠపురంలో హిట్ తర్వాత గురూజీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటున్న ఈ సినిమా అటు భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. తొలి రోజే రూ.94 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమ్మ సెంటిమెంట్‏తోపాటు మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి రెండో రోజు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127 కోట్లు రాబట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ గుంటూరు కారం రికార్డ్స్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సంక్రాంతి బరిలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ మహేష్ క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అటు అమెరికాలోనూ మహేష్ హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు యూఎస్ లో ఈ మూవీ 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ రికార్డ్ సాధించిన మహేష్ ఐదో సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా యూఎస్ఏ లో 2 మిలయన్ డాలర్లు కలెక్షన్స్ ఇన్నిసార్లు సాధించిన టాలీవుడ్ హీరో మహేష్ ఒక్కటే. పండగ సీజన్.. అందులోనూ వీకెండ్ కావడంతో ఈ మూవీ మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా శ్రీలీల కథానాయికగా నటించగా.. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలకపాత్ర పోషించింది. అలాగే జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, రాహుల్ రవింద్రన్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మరో బలం మ్యూజిక్. మాస్ కమర్షియల్ గా వచ్చిన ఈ చిత్రానికి థమన్ అందించిన మాస్ మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.