Naga Chaitanya: అమీర్ ఖాన్ కూతురి పెళ్లి వేడుకలో నాగచైతన్య.. బాలీవుడ్ తారలతో యువసామ్రాట్..
నిన్న ముంబైలోని ఎన్ఎంఏసీసీలో జరిగిన రిసెప్షన్ వేడుకలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, జయా బచ్చన్, అనిల్ కపూర్, రేఖ, హేమ మాలిని, ధర్మేంద్ర హాజరయ్యారు. అలాగే ఈ వేడుకలకు టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, నుపుర్ శిఖరే వివాహం జనవరి 3న గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ముంబైలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉదయపూర్ లోని కాథలిక్ వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మ్యారేజ్ అనంతరం.. ఇప్పుడు రిసెప్షన్ వేడుకలు జరుగుతున్నాయి. నిన్న ముంబైలోని ఎన్ఎంఏసీసీలో జరిగిన రిసెప్షన్ వేడుకలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, జయా బచ్చన్, అనిల్ కపూర్, రేఖ, హేమ మాలిని, ధర్మేంద్ర హాజరయ్యారు. అలాగే ఈ వేడుకలకు టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ వేడుకలలో చైతూ బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ఎంతో స్టైలీష్ గా.. సూపర్ కూల్‌గా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు చైతూ. గతంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చైతూ.ఈ సినిమా కంటే ముందు నుంచే అమీర్ ఖాన్ అంటే చైతూకు అభిమానం ఉంది. ఇక ఇప్పుడు ఐరా పెళ్లి వేడుకలలో పాల్గొని మరోసారి తన అభిమానాన్ని నిరూపించుకున్నాడు.
Small Glimpse of All big Celebrities at #AamirKhan‘s Daughter #IraKhan‘s Wedding Reception #SalmanKhan𓃵 #ShahRukhKhan𓀠 #NupurShikhare #MukeshAmbani #AnilKapoor #JackieShroff #Rekha #NagaChaitanya #TaapseePannu #SachinTendulkar pic.twitter.com/njQjBN7Ith
— 𝙰𝚊𝚖𝚒𝚛 ✨ (@AamirsABD) January 14, 2024
View this post on Instagram
ఇరా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కనిపించారు. అంతకు ముందు వివాహ రిజిస్ట్రేషన్ వేడుకలోనూ పాల్గొన్నారు. అలాగే రణబీర్ కపూర్ హాజరయ్యాడు. ఈ వేడుకలలో అమీర్ తన మాజీ భార్య రీనా దత్తా, జునైద్ ఇతర కుటుంబ సభ్యులు నూతన వధూవరులతో కలిసి ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైతన్య తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందు మోండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.