Guntur Kaaram: గుంటూరు కారం సినిమాపై షారుఖ్ ఆసక్తికర ట్వీట్.. మహేష్ గురించి ఏమన్నారంటే..
జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని మహేష్ అభిమానులు అంటున్నారు. అమ్మ సెంటిమెంట్, ఎమోషన్ తో మాస్ కమర్షియల్ అంశాలతో మెప్పించారు. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్, మీనాక్షి చౌదరీ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గుంటూరు కారం. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని మహేష్ అభిమానులు అంటున్నారు. అమ్మ సెంటిమెంట్, ఎమోషన్ తో మాస్ కమర్షియల్ అంశాలతో మెప్పించారు. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ బాద్ షా ఆసక్తికర ట్వీట్ చేశారు.
“గుంటూరు కారం సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. నా స్నేహితుడు మహేష్.. యాక్షన్, ఎమోషన్, మాస్ రైడ్ ఇది.” అంటూ గుంటూరు కారం ట్రైలర్ షేర్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. మహేష్ సినిమా గురించి షారుఖ్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాద్ షా నటించిన జవాన్ సినిమా గురించి మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. “బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జవాన్. అట్లీ.. కింగ్ తో కింగ్ సైజ్ వినోదాన్ని అందించాడు. షారుఖ్ క్రేజ్, చరిష్మా, స్క్రీన్ ప్రెజన్స్ సాటిలేనివి. జవాన్ సినిమాతో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తాడు. సినిమా చాలా బాగుంది. ” అంటూ ట్వీట్ చేయగా.. షారుఖ్ స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపాడు. వీరిద్దరి ట్విట్టర్ చాటా అప్పుడు నెట్టింట వైరలయ్యింది.
Looking forward to #GunturKaaram my friend @urstrulyMahesh!!! A promising ride of action, emotion and of course…. Massss!!! Highly inflammable!https://t.co/a0zUlnA1iy
— Shah Rukh Khan (@iamsrk) January 13, 2024
గతేడాది వరుసగా మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు షారుఖ్, పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు బాక్సాపీస్ వద్ద రికార్డ్స్ బద్దలుకొట్టాయి. ఈ మూడు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు షారుఖ్ ఫుల్ జోష్ మీదున్నాడు. దీంతో అతడు నటించబోయే తదుపరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.