- Telugu News Photo Gallery Cinema photos Do you know who is the first hero of mahesh babu's athadu movie
అతడులో మహేష్ కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా ??
అతడు.. మహేష్ బాబు కెరీర్‌లో మైల్ స్టోన్‌లా నిలిచిపోయిన సినిమా. బాక్సాఫీస్ లెక్కల్లోనే అన్ని సినిమాలు లెక్కేయలేం. కొన్ని సినిమాలు అలా గుర్తుండిపోతాయంతే. అలా మహేష్ బాబు కెరీర్‌లో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా అతడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది. అప్పటికే నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత అతడు తెరకెక్కించాడు. నిజానికి నువ్వే నువ్వే కంటే ముందే అతడు సినిమా కథ లాక్ చేసాడు త్రివిక్రమ్. కాకపోతే అప్పటికే దర్శకుడిగా స్రవంతి రవికిషోర్‌తో గురూజీకి కమిట్‌మెంట్ ఉండటంతో మహేష్ బాబు సినిమాను తర్వాత చేసాడు.
Updated on: Jan 13, 2024 | 8:03 PM

అతడు.. మహేష్ బాబు కెరీర్‌లో మైల్ స్టోన్‌లా నిలిచిపోయిన సినిమా. బాక్సాఫీస్ లెక్కల్లోనే అన్ని సినిమాలు లెక్కేయలేం. కొన్ని సినిమాలు అలా గుర్తుండిపోతాయంతే. అలా మహేష్ బాబు కెరీర్‌లో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా అతడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది. అప్పటికే నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత అతడు తెరకెక్కించాడు. నిజానికి నువ్వే నువ్వే కంటే ముందే అతడు సినిమా కథ లాక్ చేసాడు త్రివిక్రమ్.

కాకపోతే అప్పటికే దర్శకుడిగా స్రవంతి రవికిషోర్‌తో గురూజీకి కమిట్‌మెంట్ ఉండటంతో మహేష్ బాబు సినిమాను తర్వాత చేసాడు. పైగా అప్పుడు మహేష్ బాబు కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో అతడు కంటే ముందే నువ్వే నువ్వే వచ్చింది. అది విజయం సాధించడంతో త్రివిక్రమ్ రేంజ్ మరింత పెరిగింది. అయితే అతడు సినిమాలో మహేష్ బాబు ముందు అనుకున్న హీరో కాదు.

ఆయన కంటే ముందే మరో హీరోకు అతడు కథ చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. కానీ చివరి నిమిషంలో ఆయన డేట్స్ అడ్జస్ట్ కాక కథ మహేష్ దగ్గరికి వెళ్లింది. అలా అతడు లాంటి క్లాసిక్ సూపర్ స్టార్ ఖాతాలో పడిపోయింది. అయితే మహేష్ కంటే ముందు అతడు కథను విన్న ఆ హీరో ఎవరో కాదు.. దివంగత లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. అతడు నిర్మాత మురళీ మోహన్. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అతడు సినిమా బ్యాక్ స్టోరీ గుర్తు చేసుకున్నాడు మురళీ మోహన్.

ఉదయ్ కిరణ్‌తో రిలేషన్ గురించి చెప్పమంటే.. అతడు చాలా మంచి నటుడు.. చిత్రం చూసి నేనే ఉదయ్‌కు ఫోన్ చేసాను.. ఆ తర్వాత ఆ కుర్రాడే మా ఇంటికి వచ్చి నన్ను కలిసాడు అంటూ గతం గుర్తు చేసుకున్నాడు మురళీ మోహన్. తరుచూ తన ఇంటికి ఉదయ్ వస్తూ ఉండేవాడని.. చాలా మంచి రేంజ్‌కు ఎదుగుతాడు అనుకున్నాం కానీ మధ్యలో అలా అవ్వడం బాధాకారమని చెప్పాడు ఈయన.

అంతేకాదు.. అతడు సినిమాను ముందు ఉదయ్ కిరణ్‌తోనే ప్లాన్ చేసామని.. అతన్ని అడగడం.. వెంటనే ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని చెప్పాడు మురళీ మోహన్. అయితే అదే సమయంలో చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం అవ్వడంతో.. డేట్స్ అన్నీ అల్లు అరవింద్ వాళ్లు చూసారని.. అలా ఉదయ్‌కు తెలియకుండానే ఇతర సినిమాలకు డేట్స్ ఇచ్చేయడంతో అతడు సినిమా చేయాలంటే ఓ ఏడాది ఆగాలని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు మురళీ మోహన్. అలా ఉదయ్ నుంచి అతడు సినిమా మహేష్ బాబు దగ్గరికి వెళ్లిందని చెప్పుకొచ్చాడు ఈయన. ఒకవేళ అన్నీ అనున్నట్లు జరిగుంటే ఈ రోజు అతడు సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ అయ్యుండేవాడేమో..?




