Dil Raju: ‘ఇక్కడ ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు.. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు’.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అమ్మ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ డ్రామాకు ఎమోషనల్ టచ్ ఇచ్చిన ఈ మూవీ మొదటి రోజే భారీగా వసూళ్లు రాబట్టింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరింత హిట్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మీనాక్షి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అమ్మ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ డ్రామాకు ఎమోషనల్ టచ్ ఇచ్చిన ఈ మూవీ మొదటి రోజే భారీగా వసూళ్లు రాబట్టింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరింత హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలకు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. నిన్నటి నుంచి ఈ మూవీకి హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈక్రమంలోనే తాజాగా నిర్మాత దిల్ రాజు, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. గుంటూరు కారం సినిమా చాలా బాగుందని.. ఈ చిత్రానికి పాజిటివ్, మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయని అన్నారు ప్రోడ్యూసర్ నాగవంశీ.
ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరించారని.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహించిన దానికన్నా ఎక్కువే వచ్చాయని అన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అయితే రాత్రి ఒంటిగంట షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయని.. అవన్నీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో వచ్చేటప్పటికీ పాజిటివ్ గా మారిపోయిందని.. ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అని అన్నారు. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి.. కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారనే గ్యారెంటీ తనదని అన్నాడు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. “ఒంటిగంట షోస్ పడిన చోట మిక్డ్స్ రివ్యూస్, సోషల్ మీడియాలో వచ్చాయి. నాకు షో అయినపోయిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. పర్వాలేదండి, యావరేజ్ అని… ఇద్దరుముగ్గురు బాగుందని అన్నారు. కానీ నేను పర్సనల్ గా సినిమా చూసిన్పపుడు ఏదైతే ఫీల్ అయ్యానో దాన్నే మళ్లీ క్రాస్ చెక్ చేసుకోవడానికి సుదర్శన్ థియేటర్లలో మళ్లీ సినిమా చూశాను. ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టర్ ను బేస్ చేసుకుని చేసిన సినిమా. తల్లికొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. పండక్కి ఎంజాయ్ చేసే సినిమా ఇది ” అని అన్నారు.
“సినిమా బాగుంటే చూస్తారు.. బాగుండే సినిమాను ఏదైనా కానీ ఎవరూ ఆపరు. అది చరిత్ర అంటూ ధీమాగా చెప్పారు. ప్రతి సంక్రాంతి రాగానే మా అందరికీ యుద్ధం జరగడం సర్వ సాధారణం. ఎందుకంటే ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు. మిత్రులు కాదు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగానే చేస్తాం. రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరూ మాట్లాడరు” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.