Hanuma Movie: అగ్రిమెంట్ బ్రేక్ .. హనుమాన్ సినిమా వేయలేదట.. నిర్మాతల మండలి సీరియస్..

ప్రీమియర్స్ షోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ..అటు కలెక్షన్స్ సైతం భారీగానే రాబడుతుంది. ఈ సినిమా కథ, కథనం, విజువల్స్, నటీనటుల యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని అంశాల్లోనూ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాతోపాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సైతం జనవరి 12నే విడుదలైంది. అయితే ఈసారి సంక్రాంతి పండక్కి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో థియేటర్లు సరిపోవని ముందు నుంచే నిర్మాతలు కామెంట్స్ చేశారు. అయినా..

Hanuma Movie: అగ్రిమెంట్ బ్రేక్ .. హనుమాన్ సినిమా వేయలేదట.. నిర్మాతల మండలి సీరియస్..
Hanuman
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2024 | 5:17 PM

సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ షోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ..అటు కలెక్షన్స్ సైతం భారీగానే రాబడుతుంది. ఈ సినిమా కథ, కథనం, విజువల్స్, నటీనటుల యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని అంశాల్లోనూ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాతోపాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సైతం జనవరి 12నే విడుదలైంది. అయితే ఈసారి సంక్రాంతి పండక్కి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో థియేటర్లు సరిపోవని ముందు నుంచే నిర్మాతలు కామెంట్స్ చేశారు. అయినా.. గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో గుంటూరు కారం, మరికొన్ని థియేటర్లలో హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యింది. రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందంతో కొన్ని థియేటర్లు నైజాంలో హనుమాన్ సినిమా తీసుకున్నా.. హనుమాన్ సినిమాను రిలీజ్ చేయలేదట. ఇక ఇదే విషయంపై హనుమాన్ చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. “మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు ‘హనుమాన్’ సినిమా 12-1-2024 నుంచి ప్రదర్శన కొరకు తెలంగాణలోని కొన్ని థియేటర్లవారితో అగ్రీమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు అగ్రీమెంట్ ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన చేయలేదు. ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. థియేటర్లు అగ్రీమెంట్ ప్రకారం హనుమాన్ సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం జరిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హనుమాన్ సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతోపాటు ఇప్పటివరకు జరిగిన నష్టం భరించాలి.

Tfpc

Tfpc

థియేటర్లు వారి ఇటువంటి చర్యలవలన తెలుగు సినిమా మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ.. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం, నైతికత, నిబద్ధత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ హనుమాన్ సినిమాకు సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నది” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.