Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన మెగాస్టార్- యంగ్ టైగర్

నందమూరి అందగాడు నట సింహ బాలకృష్ణ నేడు తన 61వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా సినిమా తారలు,

Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన మెగాస్టార్- యంగ్ టైగర్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 3:30 PM

Happy Birthday NBK:

నందమూరి అందగాడు నట సింహ బాలకృష్ణ నేడు తన 61వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా సినిమా తారలు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి ఏటా బాలయ్య పుట్టిన రోజును అభిమానులు పండగలా జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది కరోనా కష్టకాలం నడుస్తుండటంతో అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని అలాగే తనను చూడటానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. “నన్ను ఎంతగానో ప్రేమించే అభిమానుల్లో ఒక్కరు దూరమైన నేను భరించలేను” అంటూ బాలకృష్ణ ఎమోషన్ పోస్ట్ ను షేర్ చేశారు. ఇక నేడు బాలయ్య పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. సినిమా పోస్టర్లు, కామన్ డీపీలతో మోతమోగిస్తున్నారు.

తాజాగా బాలయ్యకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. “జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను”అంటూ తారక్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు బాలయ్య యంగ్ లుక్ ను జత చేశారు తారక్.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణకు శుభాకంక్షలు తెలిపారు. ” మిత్రుడు బాలకృష్ణ కి  జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా బాలయ్య కు విషెస్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..

Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?