సొంత గొంతునే నమ్ముకుంటున్న మలయాళ హీరో.. పుష్పలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న ఫాహద్ ఫాజిల్
మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్పతో ఫాహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Fahad: మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్పతో ఫాహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ అప్‌డేట్‌కు కొనసాగింపుగా ఫాహద్ డబ్బింగ్‌కు సంబంధించి గట్టిగా చర్చే జరుగుతోంది. రీసెంట్‌గా ఆహాలో రిలీజ్ అయిన అనుకోని అతిథి సినిమాలో ఫాహద్‌కు హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పారు. దీంతో పుష్ప సినిమాలోనూ తరుణే డబ్బింగ్ చెబుతారా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే ఈ విషయంలో మాలీవుడ్ సినీ జనాల మాట మరోలా ఉంది. టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అనిపించుకునే మలయాళ నటులు డబ్బింగ్ చెప్పించుకునేందుకు అస్సలు పెద్ద ఇష్టపడరు. కష్టమైనా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. అప్పుడే క్యారెక్టర్‌లో సోల్ క్యారీ అవుతుందన్నది వాళ్ల ఒపీనియన్. గతంలో మమ్ముట్టి.. మోహన్‌లాల్ కూడా అలాగే చేశారు.
స్వాతికిరణం టైమ్‌లోనే డబ్బింగ్ చెప్పించుకునేందుకు నో అన్న మమ్ముటి.. సొంత గొంతుతో మెప్పించారు. రీసెంట్ గా యాత్ర సినిమాలోనూ సొంతంగానే డైలాగ్స్ చెప్పుకున్నారు. మరి అదే ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఫాహద్ డబ్బింగ్ చెప్పించుకునేందుకు ఓకే అంటారా..? అంటే అనుమానమే అంటున్నారు. అంతేకాదు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. ప్రజెంట్ ఫాహద్ తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు మీద పట్టు సాధించి.. తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారట. మరి ఈ విషయంలో సుక్కు ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి
మరిన్ని ఇక్కడ చదవండి :