Sonu Sood : ఇలా అయితే ఎలా ..? సోనూసూద్ ను విలన్ గా చూపించడానికి టెన్షన్ పడుతున్న దర్శకులు..

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా మారిన స్క్రీన్ విలన్‌. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న ఈ రియల్ హీరో...

Sonu Sood :  ఇలా అయితే ఎలా ..? సోనూసూద్ ను విలన్ గా చూపించడానికి టెన్షన్ పడుతున్న దర్శకులు..
Sonusood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 2:47 PM

Sonu sood: సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా మారిన స్క్రీన్ విలన్‌. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న ఈ రియల్ హీరో… ఇమేజ్‌, ఇప్పుడు ఫిలిమ్ మేకర్స్‌ను టెన్షన్ పెడుతోంది. గత ఏడాది కాలంగా రీల్ హీరోలంతా ఇంట్లోనే ఉంటే ఈ రియల్ హీరో మాత్రం ఫీల్డ్‌లోకి దిగి సాయం చేసే పనిలో ఉన్నారు. దీంతో ప్రజల్లో సోనూ అంటే అభిమానానికి మించిన ప్రేమ కనిపిస్తోంది. ఈ పరిస్థితిల్లో సోనూ విలన్‌గా నటిస్తే… అది సినిమాకు ప్లస్ అవుతుందా… మైనస్ అవుతుందా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ జనాలను టెన్షన్‌ పెడుతున్న పాయింట్‌. ఆ టెన్షన్‌ ఏ రేంజ్‌లో ఉందంటే.. సోనూతో ఓ సీన్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా భయపడ్డారట. ప్రజెంట్ చిరు హీరోగా తెరకెక్కుతున్న సినిమా  ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నారు సోనూ. ఆ సినిమా ఫైట్ సీక్వెన్స్ విషయంలో చిరు కొన్ని మార్పులు సూచించారు.

అది మ్యాటర్.. ఓ యాక్షన్‌ సీన్‌లో సోనూ సూద్ మీద చిరు కాలు పెట్టాల్సి ఉండటంతో.. ఆ సీన్‌ చేసేందుకు మెగాస్టారే వెనక్కి తగ్గారు. ప్రజలు దేవుడిలా కొలుస్తున్న మనిషి మీద కాలు పెడితే… పర్సనల్‌గా, సినిమా పరంగా కూడా ఇబ్బందేమో అన్న ఆలోచనతో ఆ సీన్‌ను మార్చేశారట చిరంజీవి. ఆ రేంజ్‌లో ఉంది సోనూ ఫాలోయింగ్ మరి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandamuri Balakrishna: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న నందమూరి అభిమానులు.. అఖండ న్యూ పోస్టర్ వైరల్..

“అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు”.. కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు..

Karthika Deepam: మోనిత నిజ స్వరూపం ఇప్పటికైనా నీకు తెలిసిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నించిన సౌందర్య