- Telugu News Photo Gallery Cinema photos Actor harshvardhan kapoor reveals about katrina kaif and vicky kaushal are in relationship
“అవును.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు”.. కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు..
బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ప్రేమ పక్షులకు సంబంధించిన ముచ్చట్లు తెగ వినిపిస్తున్నాయి. అందులో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట ఒకటి. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది.
Updated on: Jun 10, 2021 | 1:38 PM

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నారు. వారిద్దరూ తరచూ కలిసి తిరగడంతో ఈ వార్తలు మరింతగా సినీ పరిశ్రమలో వ్యాపించాయి.

అయితే ఇటీవల విక్కీని కత్రినాతో ఉన్న రిలేషన్ పై ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం ఇచ్చాడు విక్కీ..

కానీ వారిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు నటుడు హర్షవర్ధన్ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'విక్కీ, కౌశల్ ప్రేమించుకుంటున్నారు. ఇదే నిజం అని కుండ బద్ధలు కొట్టేశాడు.

ఈ విషయాన్ని బయటపెట్టినందుకు బహుశా నాకు ఇబ్బందులు వస్తాయేమో. అదంతా ఏమో కానీ త్వరలోనే వారు కూడా దీని గురించి స్పందిస్తారని భావిస్తున్నాను' అని తెలిపాడు.

కత్రినా చివరిసారిగా 'భారత్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె 'సూర్యవంశీ', 'ఫోన్ బూత్' చిత్రాల్లో నటిస్తోంది.

విక్కీ కౌశల్ ప్రస్తుతం 'ద ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' సినిమాలతో పాటు ఓ బయోపిక్ చేస్తున్నాడు.




