ఇండస్ట్రీకి రాకముందు హీరోయిన్ అనుష్క దగ్గర పీఆర్‌గా, మూడు నెలల్లో కోస్టార్‌గా.. పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

పరిణీతి చోప్రా.. 2011లో వచ్చిన లేడీస్ వర్సెస్ రికీ భాల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ.. అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. అన‌తికాలంలోనే అగ్రహీరోల స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది.

1/6
1
ప్రస్తుతం ఈ అమ్మడు టర్కీలో ప్రకృతితో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన పరిణీతి.. ఆమె సినీ జర్నీ, సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చింది.
2/6
4
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకోచ్చింది. అనుష్క శర్మ తన లేడీ క్రష్ అని తెలిపింది. బ్యాండ్ బాజా బారత్ సినిమా ఇంటర్వ్యూల కోసం అనుష్క డేట్స్ తానే చూసుకున్నానని తెలిపింది.
3/6
6
అదే సమయంలో అనుష్కకు పీఆర్ గా పనిచేసానని.. ఆ తర్వాత కేవలం మూడు నెలల్లో ఆమెతో నటించే స్థాయికి ఎదిగానని చెప్పుకోచ్చింది. అలా లేడీస్ వర్సెస్ రికీ బహల్ సినిమాకు తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నానని తెలిపింది.
4/6
2
అలాగే ఈ 2021 తనకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకోచ్చింది అనుష్క. నెల రోజుల వ్యవధిలో రిలీజైన మూడు సినిమాలు (సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌, సైనా, ద గర్ల్‌ ఆణ్‌ ద ట్రైన్‌) సూపర్ హిట్ అందుకున్నాయని తెలిపింది.
5/6
3
ఇక రాబోయే రోజులలో కూడా అన్ని మంచి పాత్రలే చేయాలనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం పరిణీతి చోప్రా.. రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమాలో నటిస్తోంది.
6/6
5
ఫరిణితి చోప్రా..