AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: మోనిత నిజ స్వరూపం ఇప్పటికైనా నీకు తెలిసిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నించిన సౌందర్య

Karthika Deepam: దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫేవరేట్ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కార్తీక దీపం సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల..

Karthika Deepam: మోనిత నిజ స్వరూపం ఇప్పటికైనా నీకు తెలిసిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నించిన సౌందర్య
Karthika Deepam
Surya Kala
|

Updated on: Jun 10, 2021 | 11:57 AM

Share

Karthika Deepam: దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫేవరేట్ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కార్తీక దీపం సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక్ దీపం సీరియల్ ఈరోజు 1062 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది.ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

సౌందర్య దిగులుగా మేడపైన నిలబడి ఉంటే అటుగా వచ్చిన కార్తీక్ .. తల్లిని చూసి తిరిగి వెళ్ళిపోబోతాడు.. కార్తీక్ ని దగ్గరికి రమ్మనమని పిలుస్తుంది. తలదించుకున్న కొడుకుని చూసి.. బాధగా సౌందర్య నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు. నా కొడుకు శ్రీ రామ చంద్రమూర్తి, గుణవంతుడు అని మురిసిపోయేదానిని. నీ దగ్గరకి ఆడపిల్లల్ని పంపించేవారు.. ఆడపిల్లలని పంపించడానికి మీకు భయం లేదా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగితె.. వచ్చింది సౌందర్య ఇంటికి.. కార్తీక్ దగ్గరకి అని చెప్పేవారు.. నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెట్ చేయలేదు అని అంటుంది.. నేను కూడా అనుకోలేదు అని కార్తీక్ అంటే.. నా కొడుకు సంస్కారవంతుడు అని అనుకున్నా.. నువ్వు కూడా మాములు మగాడివే అని నిరూపించుకున్నావు.. నా కొడుకుకి దుష్టగ్రహం పట్టి అనుమానిస్తున్నాడు.. అది తప్ప సుగుణాల రాశి అనుకున్న అంటుంది.. అవమాన భారంతో నువ్వు తలా దించుకున్నావు.. అది తలెత్తుకుంది నన్ను పాతాళంలోకి దించేశావు.. సమాధానం చెప్పలేని పరిస్థితిలో నువ్వు నిలబడ్డావు అంటూ కార్తీక్ ని తప్పులను బాధతో ఎత్తి చూపుతుంది. పిల్లలు ఇంటికి వచ్చాక అమ్మ కనిపించదు.. ఏమైంది డాడీ అని అడిగితె ఏమని సమాధానం చెబుతావు.. ఇన్నాళ్లు చెయ్యని నేరానికి శిక్ష వేశాను.. ఈసారి అదే నేరం చేశాను.. కాలుష్యం నా వైపు వీచింది.. అని చెబుతావా.. అంటూనే తప్పు వాళ్ళ అమ్మవైపు నెట్టాను.. మగాడివి కదా మగబుద్ధి చూపించకుఅంటూ సౌందర్య కన్నీరు పెడుతుంది. మీ నాన్నకు ఎం ఘనకార్యం సాధించవని చెప్పాలి.. మళ్ళీ మీరు తాతగారు కాబోతున్నారు కంగ్రాట్స్ అని చెప్పనా.. అంటూ బాధపడుతుంది.

సౌందర్య అన్న మాటలకు కార్తీక్ స్పందిస్తూ.. నన్ను చంపెయ్యి మమ్మీ.. నా పాపానికి పరిహారం లేదు.. ఏ విషయంలో పవిత్ర మూర్తిని బాధపెట్టానో ఆ పాపం నేను చేసినందుకు నాకు గిల్టీ ఫీలింగ్ తో చచ్చిపోతే బాగుంటుంది మమ్మీ.. ఒక్కటి మాత్రం నిజం నాకు దీప మీద ప్రేమ లేక.. మోనిత మీద మోజుతోనో చేసింది కాదు.. నన్ను నమ్ము మమ్మీ.. అంటుంటే.. నిన్ను నమ్ముతాను.. ఐతే ఒక్క చిన్న అవకాశం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. మోనిత మంచిది కాదు… అవకాశం కోసం చూస్తుంది.. నమ్మొద్దు అని నేను నీ భార్య ఎన్ని సార్లు చెప్పం.. ఇప్పటికైనా తెలిసిందా.. మోనిత గురించి నిజం.. నా ముందు మాట్లాడానికే భయపడే మురళీ కృష్ణ ఇలాంటి కొడుకుని ఎలా కన్నావు అన్నాడు. తన కూతురు అగ్ని ప్రవేశం చేసి పునీతురాలైంది కదా.. ఎన్నైనా అంటాడు.. పడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అంటూ.. అన్నం తినడానికి కార్తీక్ ని మీద మీదనుంచి కిందకు తీసుకొస్తుంది.

మరోవైపు దీప సరోజక్క మరది లక్ష్మణ్ వస్తాడు. తనకు కార్తీక్ చేసిన వైద్యం గురించి గుర్తు చేస్తూ… డాక్టర్ బాబుతో తన ఆరోగ్యం గురించి చెబుతూ.. తనకి డాక్టర్ బాబు మళ్ళీ వైద్యం చేయించడంని కోరుతాడు. ఆయన హస్తవాసి చాలా మంచిది ఈ పేదవాడికి అడుగుతాడు. అలాగే చెబుతాను నాకు కొంచెం టైం ఇవ్వమని దీప అడుగుతుంది. ఆగుతాను.. కానీ గుండె ఆగిపోకుండా వీలైనంత త్వరగా చెప్పమని కోరతాడు.. వీలైనంత త్వరగా డాక్టర్ బాబుకి తన ఆరోగ్యం గురించి చెప్పమని లక్ష్మణ్ అడుగుతాడు. చెబుతా అంటూ దీప పంపిస్తుంది.

సౌందర్య, కార్తీక్, ఆదిత్య భోజనం చేస్తున్న సమయంలో శౌర్య, హిమలు వస్తారు. దీప గురించి తండ్రిని అడుగుతారు. మీరు ఎందుకు వచ్చారు అన్నట్లు చూస్తున్నారు.. మేము రావడం మీకు ఇష్టం లేదాఅని ప్రశ్నిస్తారు.. కనీసం పలకరింపుగా చిన్న నువ్వుకూడా నవ్వరా అని అంటుంది శౌర్య

Also Read: శనీశ్వరుడిని జయంతిరోజున చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఏమిటంటే