Shani Jayanti 2021: శనీశ్వరుడిని జయంతిరోజున చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఏమిటంటే
Shani Jayanti 2021: దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. సూర్య ప్రుత్రుడు శనీశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం జేష్ఠ అమవాస్య తిథిరోజున నిర్వహిస్తారు. ఈ రోజున..
Shani Jayanti 2021: దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. సూర్య ప్రుత్రుడు శనీశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం జేష్ఠ అమవాస్య తిథిరోజున నిర్వహిస్తారు. ఈ రోజున శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని.. కష్టాలు దూరమై.. గ్రహస్థితి కలిసి వస్తుందని భక్తుల నమ్మకం.సూర్యదేవుడు కుమారుడైన శనిను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. అమావాస్య తిథిలో వస్తుంది కాబట్టి, శని జయంతిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ ముఖ్యమైన రోజున మీరు ఏమి చేయాలి మరియు చేయకూడదు అని తెలుసుకోండి…
చేయాల్సిన పనులు :
శని జయంతి రోజున బ్రహ్మ ముహర్తంలో నిద్ర లేవాలి. (సూర్యోదయానికి రెండు గంటల ముందు). స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో గంగాజలాన్ని కలుపుకుంటే మంచిది స్నానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించాలి. బ్రహ్మచర్యాన్ని కొనసాగించండి మరియు సంకల్ప చేయండి నువ్వుల నూనెతో ఇత్తడి లేదా మట్టి దీపం వెలిగించండి హనుమాన్ చాలిసాను వీలైనన్ని సార్లు పఠించండి. మరణించిన పూర్వీకులకు తర్పణం అర్పించండి అన్నదానం నిర్వహించండి.
చేయకూడనివి :
బియ్యం, గోధుమలను శని జయంతిరోజున దూరంగా ఉంచండి ఉల్లిపాయ , వెల్లుల్లి తో ఉన్న ఆహారాన్ని తినవద్దు మాంసాహారానికి దూరంగా ఉంచండి పొగాకు , మద్యానికి దూరంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకూడదు ఎవరితోనూ వాదన చేయవద్దు శనిజాయన్తి రోజున ఎవరైనా మాటలతో కానీ.. పనుల ద్వారా కానీ బాధించవద్దు
Also Read: ఈరోజు రోహిణి నక్షత్రలో ఏర్పడనున్న సూర్య గ్రహణం..ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే