Solar eclipse: ఈరోజు రోహిణి నక్షత్రలో ఏర్పడనున్న సూర్య గ్రహణం..ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే

Solar eclipse: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం.. అది సంపూర్ణ సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై..

Solar eclipse: ఈరోజు రోహిణి నక్షత్రలో ఏర్పడనున్న సూర్య గ్రహణం..ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే
Solar Eclipse 2021
Follow us

|

Updated on: Jun 10, 2021 | 9:52 AM

Solar eclipse: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం.. అది సంపూర్ణ సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో ఉండదని పండితులు తెలిపారు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడటంతో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలుస్తారు.

ఇటీవల ఒక చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్‌ 10న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో గ్రహణం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. పాక్షిక గ్రహణం మాత్రమే చూడవచ్చు. మధ్యాహ్నం 12.51 గంటలకు ముగుస్తుంది. నాసా ప్రకారం.. జూన్ 10 న  గ్రీన్‌లాండ్‌, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌, యూరప్‌, రష్యా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనబడుతుంది.

సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో నివసించే భారతీయులు మాత్రం గ్రహణ సమయంలో వారి పరిస్థితులను బట్టి జప, తప, తర్పణ, స్నాన మరియు హోమ విధులు నిర్వర్తించుకోవచ్చు. ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ఏర్పడటం వల్ల వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సంభవించే దేశాల్లో వృషభ రాశివారు గ్రహణ సమయంలో సూర్యారాధన, రాహు, దుర్గాదేవి జపం ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

కాగా ఈ సంత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నటు. ఇప్పటికే ఒక చంద్రగ్రహణం ఏర్పడగా.. ఈరోజు సూర్య గ్రహణం, నవంబర్‌ 19న పాక్షిక చంద్ర గ్రహణం, డిసెంబర్‌ 4న సంపూర్ణ సూర్య గ్రహణం రానున్నాయి. ఈ నాలుగు గ్రహణాల ప్రభావం భారతదేశంపై ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: సూర్యగ్రహణం ఏ సమయంలో చూడాలి..! చూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్