Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 18 మంది ప్రయాణికులు మృతి

నైజీరియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టడంతో 18 మంది దుర్మరణంపాలయ్యారు.

Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 18 మంది ప్రయాణికులు మృతి
Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 10, 2021 | 9:31 AM

Nigeria Road Accident: నైజీరియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టడంతో 18 మంది దుర్మరణంపాలయ్యారు. ఉత్తర నైజీరియాలోని జిగవా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు సంఘటన స్థలంలోనే మరణించారని జిగవా పోలీసు అధికార ప్రతినిధి లావాన్ షీశు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యల చేపట్టామని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ బస్సు డ్రైవరు కాలు విరగడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. నైజీరియా దేశంలో అధ్వానంగా మారిన రోడ్లు, ఓవర్ లోడింగ్, రాష్ డ్రైవింగ్ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Vishal: డాక్యుమెంట్స్ వివాదం.. ఆ బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. ట్వీట్ వైరల్..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..