Building Collapsed: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. 9 మంది మృతి..
Building Collapsed in Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్థలు భవనం కుప్పకూలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో
Building Collapsed in Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్థలు భవనం కుప్పకూలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద ఉన్నారు. ఈ విషాధ సంఘటన ముంబైలోని మల్వానిలో బుధవారం రాత్రి 11.00 గంటల సమయంలో జరిగింది. ముంబైలో నిన్న భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
భవనం కూలిన సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం కూలిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. స్థానికులు, పోలీసుల సహాయంతో విపత్తు సిబ్బంది శిథిలాల నుంచి 15 మందిని రక్షించారు. గాయపడిన వారిని బీడీబీఏ మునిసిపల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 9 మంది మరణించారని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా.. భారీ వర్షాలవల్లే భవనం కుప్పకూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు సమీప భవనాల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించారు
Also Read: