ప్రకాశం జిల్లాలో బయటపడ్డ పురాతన వెండి నాణేలు.. ఎగబడ్డ స్థానికులు.. వచ్చిపడ్డ పోలీసులు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఆర్ ఉమ్మడివరం గ్రామంలో పురాతన వెండి నాణేలు బయడపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని....
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఆర్ ఉమ్మడివరం గ్రామంలో పురాతన వెండి నాణేలు బయడపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడివరం గ్రామ నడిబొడ్డున ఉన్న మశమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మట్టి తవ్వి శివారులో పారబోస్తుండగా వెండినాణేలు బయటపడ్డాయని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. ఇటీవల వర్షం కురవడంతో మట్టిలో నుంచి కొన్ని పురాతన వెండి నాణేలు బయటపడినట్టు చెప్పారు. వీటిని చూసిన చిన్నారులు విషయాన్ని గ్రామంలో చెప్పడంతో నాణేల కోసం గ్రామస్థులు వెతుకులాట మొదలుపెట్టారు. సుమారు 500 వరకు లభించాయని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఎస్సై సుధాకర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. పురాతన నాణేలు అయినందున అవి ప్రభుత్వానికి చెందుతాయని తెలిపారు. జెట్టేబోయిన అనిల్ అనే వ్యక్తి తనకు దొరికిన ఆరు నాణేలను వారికి అందజేశారు. ఇవి 1860 నుంచి 1890 మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు. మిగిలిన నాణేలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకునేందకు అని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: తన 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అతను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్