ప్రకాశం జిల్లాలో మద్యం వాహనం బోల్తా..! పరుగు పరుగునా వచ్చిన మద్యం ప్రియులు..! కట్ చేస్తే..!
ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కలుజువ్వాలపాడుకు మద్యం బాటిల్స్ తీసుకెళ్తున్న బోలెరో వాహనం
ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కలుజువ్వాలపాడుకు మద్యం బాటిల్స్ తీసుకెళ్తున్న బోలెరో వాహనం గ్రామ సమీపంలోకి వస్తుండగా బోల్తా పడింది. ప్రభుత్వ మద్యం తీసుకెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో, మద్యం బాటీళ్ళు రొడ్డుపై పడి పగిలిపోయాయి. ఫలితంగా అందులో ఉన్న 200 కార్టన్ల మద్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. రొడ్డుపై మద్యం పారింది.. ఆ నోట ఈ నోట తెలుసుకున్న సమీపంలోని గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు అక్కడి చేరుకున్నారు. మద్యం వాహనం తరలించేవారు అక్కడ పెద్ద జాతరలా కనిపించింది. పగిలిపోగా మిగిలినవాటిని మరో వాహనంలో తరలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ సంఘటనను చూస్తూ నిలబడ్డ మద్యం ప్రియులను కంట్రోల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారమైంది. మొత్తం మద్యం విలువ.. సుమారు రూ.లక్షల్లో ఉంటుందని స్థానిక అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు.