TSRTC : గుడ్ న్యూస్ : ఇక ఉ. 6 గంటల నుంచి సా. 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగుతాయ్.. మెట్రో కూడా.!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. లాక్డౌన్ విరామ సమయం పెరగడంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచింది..
TSRTC and Hyderabad Metro timings extended : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. లాక్డౌన్ విరామ సమయం పెరగడంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచింది టీఎస్ఆర్టీసీ. ఫలితంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. లాక్డౌన్ విరామ సమయం పెరగడంతో బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు తిప్పుతున్నామని… వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని ఆయన స్పష్టం చేశారు. అటు, హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణ వేళల్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైళ్లను తిప్పుతామని హైదరాబాద్ మెట్రో తెలిపింది. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.