Telangana lands : ‘సర్వే రాళ్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా.. ఇంచు తేడా రాకుండా భూములకు రక్షణ’ : రెవెన్యూ శాఖ

తెలంగాణలో వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్..

Telangana lands : 'సర్వే రాళ్లు ఊడిపోయినా,  కొలతల కాగితాలు చినిగిపోయినా..  ఇంచు తేడా రాకుండా భూములకు రక్షణ' : రెవెన్యూ శాఖ
Lands Digital Survey
Follow us

|

Updated on: Jun 09, 2021 | 5:33 PM

Digital maping protection: తెలంగాణలో పొలాలు, స్థలాలకు సంబంధించి సర్వే రాళ్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా.. తెలంగాణలో రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ రక్షణ లభిస్తుందని రెవిన్యూ శాఖ పేర్కొంది. తెలంగాణలో వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్ చట్టం- 2020 దీనికి దోహదపడుతుందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సమస్య లేవీ లేకుండా రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదయినాయని తెలంగాణ కేబినెట్ కు రెవిన్యూ శాఖ వివరించింది. రైతుల కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా వుండే హద్దురాళ్లు, కాగితాలమీద వుండే కొలతలు ఇక నుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని చెప్పారు.

రాళ్లు ఊడిపోయినా కొలతల కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని రెవిన్యూ శాఖ కేబినెట్ కు వివరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్ ) ను నిర్దారించాలని, అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్నటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదించింది.

Read also : YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు