YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు

జూలై 8న పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నామని వైయస్ షర్మిల ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామన్న ఆమె, కార్యకర్తలే రేపటి ప్రజానాయకులని..

YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ... పూర్తి వివరాలు
Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 09, 2021 | 3:02 PM

Sharmila : జూలై 8న పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నామని వైయస్ షర్మిల ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామన్న ఆమె, కార్యకర్తలే రేపటి ప్రజానాయకులని చెప్పారు. వైయస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలి.. వారి వివరాలు, కష్టాలు తెలుసుకోవాలని షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇవాళ సన్నాహాక సమావేశం నిర్వహించారామె. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ పార్టీ ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జూలై 8న అత్యంత ఘనంగా కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన, ఈ సదర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, నిర్వహణ తదితర విషయాలపై ఈ సన్నాహాక సమావేశంలో చర్చించారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళ ప్రకటించారు.

కాగా, షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా నిన్ననే ఆపార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్​ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు.

పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ ఇప్పటికే లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా, తెలంగాణ పాలిటిక్స్‌లో అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా షర్మిల వాడి వేడి విమర్శల బాణాలు సైతం వదులుతున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రైతుల వెతలు తదితర అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు షర్మిల.

Read also : Bharat Biotech : ‘కోవాగ్జిన్‌’ తయారీదారు భారత్ బయోటెక్​ సంస్థకి కేంద్రం భారీ భద్రత, 64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ కవర్‌

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు