Bharat Biotech : ‘కోవాగ్జిన్‌’ తయారీదారు భారత్ బయోటెక్​ సంస్థకి కేంద్రం భారీ భద్రత, 64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ కవర్‌

శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం..

Bharat Biotech  : 'కోవాగ్జిన్‌' తయారీదారు భారత్ బయోటెక్​ సంస్థకి కేంద్రం భారీ భద్రత,  64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ కవర్‌
Bharat Biotech
Follow us

|

Updated on: Jun 09, 2021 | 7:17 AM

CISF cover for Bharat Biotech campus in Hyderabad : కొవిడ్ – 19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్‌’ తయారు చేస్తోన్న హైదరాబాద్ లోని భారత్ బయోటెక్​ సంస్థకి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పై హైదరాబాద్ శామీర్ పేట్ లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ కు సీఐఎస్​ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)​ భద్రత కల్పిస్తారు. ఫలితంగా శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తారు. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం..ప్లాంట్​ను తమ అధీనంలోకి తీసుకోనుంది. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్​ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

కాగా, భారత్ లో కోవిషిల్డ్, కోవాగ్జిన్ రెండు వాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

దేశ వైద్య, ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ ఒక ముఖ్యమైన సంస్థ అని.. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌ లోని భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించనుందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read also : Vahanamitra : వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం