High Court: ప్రజాసంఘాల నిషేధంపై హైకోర్టులో విచారణ నాలుగు వారాలకు వాయిదా

TS High Court: రాష్ట్రంలో 16 ప్రజాసంఘాల నిషేధంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అమరుల బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ...

High Court: ప్రజాసంఘాల నిషేధంపై హైకోర్టులో విచారణ నాలుగు వారాలకు వాయిదా
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 09, 2021 | 3:05 PM

రాష్ట్రంలో 16 ప్రజాసంఘాల నిషేధంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అమరుల బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నిర్వహించింది కోర్టు. మావోయిస్టు అనుబంధ సంఘాలంటూ చట్టవ్యతిరేకంగా నిషేధం విధించారని పిటిషనర్ పేర్కొన్నారు పద్మకుమారి. నిబంధనల మేరకే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏజీ వెల్లడించారు. కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలావుంటే.. తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై, తెలంగాణ విద్యార్థి వేదిక పై, చైతన్య మహిళా సంఘం వంటి మొత్తం  16 ప్రజా సంఘాలపై నిషేదం కొనసాగుతోంది. ఈ నిషేధం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజా సమస్యలపై, హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరాడు.

ఇవి కూడా చదవండి : ఆహా.. ఏమి అదృష్టం..! భార్యతో గడ్డం గీయించుకున్న భర్త..! కెమెరాకు ఇలా చిక్కింది.. కట్ చేస్తే..!

ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా..! రేటును నిర్ణయించిన కేంద్రం.. ఏ టీకా ధర ఎంతంటే..!