నయా దోపిడీ.. నేరగాళ్ల చేతిలో మోసపోయిన 5 లక్షల మంది.. రూ.150 కోట్ల మోసం.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు

దేశంలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇక గత రెండు నెలల్లో 5 లక్షలకుపైగా వ్యక్తులను రూ.150 కోట్ల..

నయా దోపిడీ.. నేరగాళ్ల చేతిలో మోసపోయిన 5 లక్షల మంది.. రూ.150 కోట్ల మోసం.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు
Follow us

|

Updated on: Jun 09, 2021 | 7:35 PM

దేశంలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇక గత రెండు నెలల్లో 5 లక్షలకుపైగా వ్యక్తులను రూ.150 కోట్ల వరకు మోసం చేసిన కేసులో 11 మందిని ఢిల్లీ పోలీస్‌ సైబర్‌ సెల్‌ బుధవారం అరెస్టు చేసింది. వీరు పవర్‌ బ్యాంక్‌, సన్‌ఫ్యాక్టరీ, ఎజ్‌ప్లాన్‌ వంటి యాప్‌లను ఉపయోగించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ యాప్‌లతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల ప్లేస్టోర్‌లో పవర్‌ బ్యాంక్‌ యాప్‌, ఎజ్‌ప్లాన్‌ యాప్‌ www.ezplan.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యాప్‌లపై పెట్టుబడిపై రెట్టింపు రాబడి ఇస్తున్నట్లు ఈ ముఠా ప్రకటించింది. కొందరి నుంచి పెట్టుబడి పెట్టించుకుని గంట, రోజువారీగా రాబడి ఇచ్చారు. ఇక వీరిని చూసి మ‌రింత మంది నుంచి పెట్టుబడులు పెట్టారు. ఈ యాప్ యజ‌మానులైన చైనా వ్యక్తులు భార‌త్‌లోని బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీల‌కు స‌హాయం చేయ‌డానికి సంప్రదించారు. నిందితులతో కలిసి యాప్‌ యజమానులు దాదాపు 5 లక్షల మంది నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు సేకరించి మోసం చేసినట్లు డీసీపీ అన్యేష్‌ రాయ్‌ వెల్లడించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

అయితే పవర్‌ బ్యాంక్‌, ఈజడ్‌ప్లాన్‌ అనే రెండు యాప్‌లపై సోషల్‌ మీడియాలో వందలాది ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కొందరు ఫిర్యాదుదారులు తాము లక్షల్లో మోసపోయినట్లు పోలీసులకు తెలిపారు. పవర్ బ్యాంక్ యాప్ వేలాది డౌన్‌లోడ్‌లతో యాప్ స్టోర్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని డీసీపీ తెలిపారు. ఈ మోసగాళ్లు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. బెంగాల్‌, ఢిల్లీ, బెంగళూరు పోలీసుల సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి బెంగళూరు నుంచి పనిచేస్తున్న టిబెటన్ మహిళను ఐజీఐఏ విమానాశ్రయంలో పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold: మీరు బంగారం అమ్మేయాలని అనుకుంటున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోవాలి.. లేదంటే నష్టపోవాల్సిందే..!

కేంద్రం హెచ్చరిక: అలాంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. లేదంటే మోసపోవాల్సిందే..!

Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!