Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!
Old Rs 10 Note: కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? గడ్డు పరిస్థితుల్లో ఉన్నారా? అయితే మీకు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం అందుబాటులో..
Old Rs 10 Note: కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? గడ్డు పరిస్థితుల్లో ఉన్నారా? అయితే మీకు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం అందుబాటులో ఉంది. ఇంట్లో కూర్చొనే రూ.25,000 వరకు సంపాదించవచ్చు. దీని కోసం మీరు కష్టపడాల్సిన పని కూడా లేదు. కేవలం మీ వద్ద పాత రూ.10 నోటు ఉంటే చాలు. ఆన్‌లైన్‌లో ఈ పాత పది రూపాయల నోట్లను అమ్మడం ద్వారా రూ.25 వేల వరకు పొందవచ్చు. ప్రస్తుతం కొత్త నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎవరి దగ్గరైనా ఉంటే పెద్దగా పట్టించుకోరు. వీటి గురించి పెద్దగా తెలిసి ఉండదు. అయితే పాత నోట్లకు మాత్రం డిమాండ్ ఉంటుంది. ఇవి ఎవరి వద్ద అంటే వారి వద్ద ఉండవు. మీ వద్ద పాత రూ.10 నోటు ఉంటే మీరు డబ్బు సంపాదించవచ్చు. అయితే పాత పది రూపాయల నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోటు భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో 1943లో జారీ చేయబడింది. అంతేకాదు.. ఈ నోటుపై అప్పటి గవర్నర్ సిడి దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా 10 రుపాయలు ఆంగ్ల భాషలో రెండు చివర్లలో వెనుక వైపు రావాలి. అశోక స్తంభంతో వచ్చిన తొలి నోటు ఇది. ఇలాంటివి ఉంటేనే ఆన్‌లైన్ Coinbazzar.com ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై కొనుగోలుదారులు పాత నోట్లు, నాణేలకు వేలు, లక్షల్లో చెల్లిస్తుంటారు.
రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు..
ఇలాంటి రూ.10 నోట్లకు మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.25,000 వరకు ధర పలుకుతోంది. మీ వద్ద 4 నోట్లు ఉన్నా రూ.లక్ష వస్తాయి. మీరు ఈ నోటును ఆన్‌లైన్‌లోనే విక్రయించవచ్చు. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో మీరు ఈ నోట్లను విక్రయానికి పెట్టొచ్చు.
పాత నోట్లను ఎలా అమ్మాలి..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ Coinbazzar.com కు లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి మీరే విక్రేతగా నమోదు చేసుకోవాలి.
మీ రూ.10 నోటు యొక్క రెండు వైపుల ఫోటోలు స్పష్టంగా కనిపించేలా అప్‌లోడ్ చేయాలి.
ఈ కాయిన్ బజార్ ప్లాట్‌ఫామ్‌లో పాత నోట్లను మరియు నాణేలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న వ్యక్తుల ప్రకటన కనిపిస్తుంది.
పాత పది రూపాయల నోటు కొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ ప్రకటనను చూసి తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు వారిని సంప్రదించి నోట్లను విక్రయించుకోవచ్చు. అయితే ఇలాంటి పాత నోట్లు, పాత నాణేలను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వీరికి ఇదొక అలవాటు. ఎన్ని వేలైనా ఇలాంటి పాత నోట్లను కొనుగోలు చేసి ఉంచుకుంటారు.