Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా రెండు బ్యాంకులకు షాకిచ్చింది. ఏకంగా రూ.6 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు నిబంధనలు..

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!
Follow us

|

Updated on: Jun 09, 2021 | 1:55 PM

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా రెండు బ్యాంకులకు షాకిచ్చింది. ఏకంగా రూ.6 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు నిబంధనలు అతిక్రమించడం కారణంగా జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ (PNB), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI)బ్యాంకులపై ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. క్లాసిఫికేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ రూల్స్ అతిక్రమణ కారణంగా ఈ మేరకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్‌బీఐ గరిష్టంగా రూ.4 కోట్ల జరిమానా వేసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఆర్‌బీఐ ఈ మేరకు రెండు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ఎందుకు పెనాల్టీ విధించకూడదో తెలియజేయాలని కోరింది.

ఇవీ కూడా చదవండి:

Syndicate Customers: సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. జూలై 1నుంచి అమల్లోకి సరికొత్త IFSC కోడ్ .. తెలుసుకోవడం ఎలా అంటే..

భారతదేశంలో పెట్టుబడులను పెంచుతుంది.. క్రిప్టోకరెన్సీపై ఆసక్తి చూపించిన ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని…

SBI Doorstep Banking: కస్టమర్లకు శుభవార్త.. ఎస్బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్.. ఇంటి వద్దకే సేవలు