కేంద్రం హెచ్చరిక: అలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. లేదంటే మోసపోవాల్సిందే..!
Central Government Alert: ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ మోసాలు, ఇతర సైబర్ నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్లను..
Central Government Alert: ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ మోసాలు, ఇతర సైబర్ నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్లను పలు రకాలుగా మోసగిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మోసగాళ్లు కొత్త విధానంలో ప్రజలను నిలువునా మోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేసింది. ట్విట్టర్ వేదికగా జాగ్రత్తగా ఉండాలంటూ కోరుతోంది. సైబర్ మోసగాళ్లు కేవైసీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంది. అందువల్ల కేవైసీ లేదా రిమోట్ యాక్సెస్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఫోన్ కాల్ లేదా మెసేజ్‌లు పంపి మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు తస్కరించి తద్వారా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అలాగే ఎస్ఎంఎస్‌లలో ఉండే లింక్స్‌పై ఏ మాత్రంక్లిక్ చేయవద్దని సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా కాల్ చేస్తే.. వారికి మీ ఫోన్ లేదా కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని, కేవైసీ పూర్తి చేసుకోవాలని మెసేజ్ వస్తుంటాయి. లేదంటే కాల్స్ చేస్తుంటారు. అలాంటి వాటిపై స్పందించవద్దని కేంద్రం హెచ్చరిస్తోంది. అంతేకాదు వారు చెప్పి మొబైల్ యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తోంది.
Beware of KYC/Remote access App Frauds: pic.twitter.com/PZLvlLBlVU
— Cyber Dost (@Cyberdost) June 7, 2021