AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Recharge: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి వాట్సాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే సౌకర్యం.. అలాగంటే..!

Jio Whatsapp Recharge: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా కూడా రీఛార్జ్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 70007 70007 నెంబర్‌ను మొబైల్‌లో.

Jio Recharge: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి వాట్సాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే సౌకర్యం.. అలాగంటే..!
Jio Recharge
Subhash Goud
|

Updated on: Jun 09, 2021 | 5:39 PM

Share

Jio Whatsapp Recharge: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా కూడా రీఛార్జ్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 70007 70007 నెంబర్‌ను మొబైల్‌లో సేవ్‌ చేసుకుని వాట్సాప్‌లోకి వెళ్లి హయ్‌ అని మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. దీంతో జియో కేర్‌ నుంచి పలు ఆప్షన్లతో కూడిన మెనూ వస్తుంది. అందులో మనం రీఛార్జ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే ప్లాన్స్‌ వివరాలు వస్తాయి. ఆ తర్వాత రీఛార్జ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ సంస్థతో అనుసంధానమైన జియో.. ఇప్పుడు రీఛార్జ్‌, ఇతర చెల్లింపులు వాట్సాప్‌ ద్వారా చేసుకోవచ్చు.

వినియోగదారులు వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఫిర్యాదులు, ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు. ఇక జియో యూజర్లు వాట్సాప్‌ నుంచి రీఛార్జ్‌, చెల్లింపులు, ఇతర సేవలు పొందేందుకు జియో వాట్సాప్‌తో అనుసంధానం చేసింది. జియో వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా తమ ప్రశ్నలకు సమాధానం అందుకోనున్నారు. ఈ-వాలెట్లు, యూపీఐ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వంటి అన్ని చెల్లింపులు వాట్సాప్‌ నుంచి 70007 70007 కు ‘హాయ్’ అనే సందేశాన్ని  పంపి పలు సేవలు పొందవచ్చు. కాగా, మొబైల్‌ రీఛార్జ్‌, చెల్లింపులు అందించడానికి జియో వాట్సాప్‌తో జత కట్టింది.

అయితే ప్రస్తుతం ఈ సేవలు అంగ్లీష్‌, హిందీ భాషలలో అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో అన్ని భాషల్లో అందుబాటులో రానుంది. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ జియో ఫ్లాట్‌ఫామ్‌లు, ఫేస్‌బుక్‌లు గత ఏడాది జియో ప్లాట్‌ఫామ్‌లలో ఫేస్‌బుక్‌ రూ.43,574 కోట్ల పెట్టుబడి కోసం బైండింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఈ ఇప్పుడు సాధ్యమైంది. అయితే ఇందులో జియో సిమ్‌ రీఛార్జ్‌, కొత్త జియో సిమ్‌ అండ్‌ ఎంఎన్‌పీ, జియో సిమ్‌ సపోర్ట్‌, జియో ఫైబర్‌ సపోర్టు, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, జియో మార్ట్‌ వంటి సేవలు పొందవచ్చు.

Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ రెండు బ్యాంకులకు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!