AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..

నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగేనే చెప్పాలి. ఆయన పుట్టిన రోజును సంబరంగా జరుపుకుంటుంటారు ఫ్యాన్స్.

Balakrishna : ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుండగా దర్జాగా నడిచొస్తున్న నటసింహం.. బాలయ్య బర్త్ డే స్పెషల్ పోస్టర్..
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2021 | 9:49 PM

Share

Balakrishna : నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగేనే చెప్పాలి. ఆయన పుట్టిన రోజును సంబరంగా జరుపుకుంటుంటారు ఫ్యాన్స్. బాలయ్య ఫొటోకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు అంటూ హంగామా చేస్తారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తనను చూడటానికి ఎవ్వరు రావద్దని బాలయ్య విజ్ఞప్తి చేశారు. తన అభిమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేనని, ఏ ఒక్కరు దూరమైన భరించలేనని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు టీజర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య పుట్టిన రోజున ఈ సినిమా నుంచి పాట కానీ ట్రైలర్ కానీ వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. కాగా తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విజయోత్సవంతో ప్రజలంతా సంబరాలు జరుపుతూ ఉంటే బాలకృష్ణ దర్జాగా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో  చూడొచ్చు. ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని  అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Kareena Kapoor: ప్రొడ్యూసర్లకు షాక్ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్.. సీత పాత్ర కోసం ఏకంగా..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో