Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Director Prashanth Neel : దక్షిణ భారత సినిమా టాప్ డైరెక్టర్ ఎవరు అని అడిగినప్పుడు మొదటి వరుసలో ఎస్.ఎస్.

Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
Director Prashanth Neel
Follow us
uppula Raju

|

Updated on: Jun 09, 2021 | 7:58 PM

Director Prashanth Neel : దక్షిణ భారత సినిమా టాప్ డైరెక్టర్ ఎవరు అని అడిగినప్పుడు మొదటి వరుసలో ఎస్.ఎస్. రాజమౌలి, శంకర్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా గొప్ప పేరు సంపాదించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసిస్తూ రోబో సినిమాగా తీసిన గొప్ప వ్యక్తి తమిళ దర్శకుడు శంకర్. ఇప్పుడు మూడో వ్యక్తి KGF సినిమాతో సత్తా చాటిన ప్రశాంత్ నీల్. రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF సినిమాని బొంబాయి ఫిల్మ్స్ నిర్మించింది. ఇది భారతీయ సినిమాల్లో చక్కటి గుర్తింపును సంపాదించింది. ఈ చిత్రం కొనసాగింపుగా KGF పార్ట్ 2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీని ట్రైలర్ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

KGF 2 విడుదలకు దాదాపుగా సిద్ధంగా ఉంది. కన్నడ సూపర్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి, రవీనా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, అనేక ఇతర తారలు ఈ చిత్రంలో నటించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా మరో కొత్త సినిమాకు ప్రశాంత్ నీల్ యాక్షన్ కట్ చేయబోతున్నాడు. ఇప్పటికే సలార్ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు నీల్ జూనియర్ ఎన్‌టీఆర్‌తో కూడా మరో కొత్త ప్రాజెక్టుపై సంతకం చేశాడు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. అలైడ్ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రశాంత్ నీల్ కు 15 కోట్ల చెక్కుతో స్వాగతం పలికారని తెలిసింది. కన్నడలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా ప్రశాంత్ నీల్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ తన పారితోషికం గురించి అడిగినప్పుడు స్పందించారు. ” నేను అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిని అని ఇప్పుడు నాకు అనిపించదు. ఇది చర్చించవలసిన విషయం అని కూడా అనుకోను. అది నా వ్యక్తిగత అభిప్రాయం” అన్నారు. మొత్తానికి కన్నడ నాట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఈ విధంగా మార్మోగుతుంది.

నయా దోపిడీ.. నేరగాళ్ల చేతిలో మోసపోయిన 5 లక్షల మంది.. రూ.150 కోట్ల మోసం.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు

Post COVID Problems: కరోనా బాధితులకు వైరస్ తగ్గాకా చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Viral video : ఎర్ర చీర కట్టుకొని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో ఫీట్స్..! చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..! వైరల్ వీడియో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే