AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : ఎర్ర చీర కట్టుకొని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో ఫీట్స్..! చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..! వైరల్ వీడియో..

Viral video : మహిళలు మగవారికంటే ఎక్కడా తక్కువ కాదని నిరూపిస్తుంది ఈ మహిళ. ఏకంగా ఎర్ర చీర ధరించి ఎవ్వరికి

Viral video : ఎర్ర చీర కట్టుకొని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో ఫీట్స్..! చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..! వైరల్ వీడియో..
Woman Gas Cylinder
uppula Raju
|

Updated on: Jun 09, 2021 | 7:14 PM

Share

Viral video : మహిళలు మగవారికంటే ఎక్కడా తక్కువ కాదని నిరూపిస్తుంది ఈ మహిళ. ఏకంగా ఎర్ర చీర ధరించి ఎవ్వరికి సాధ్యంకాని ఫీట్స్ చేస్తుంది. ఎల్పీజీ సిలిండర్‌తో విన్యాసాలు చేస్తుంది. ఈ మహిళ సిలిండర్‌ను ఎత్తి వ్యాయామం చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్‌గా మారింది. ఈ మహిళ పేరు షెల్లీ చికారా. ఈమె తన దంతాలతో కూడా సిలిండర్‌ను ఎత్తి ఔరా అనిపించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారందరు తమ కామెంట్స్‌తో షెల్లీని అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఆమె వీడియోలను షేర్ చేస్తు వైరల్‌ చేస్తున్నారు.

ఒక వీడియోలో ఎర్ర చీర ధరించి రెండు చేతులతో గ్యాస్ సిలిండర్ ఎత్తడం కనిపిస్తుంది. ఈ సిలిండర్ నిండినదా ఖాళీదా అని మాత్ర చెప్పలేం. ఏదేమైనా ఈమె చేసిన సాహసానికి మాత్రం గుర్తింపు వస్తోంది. వీడియో నేపథ్యంలో హర్యన్వి పాట ప్లే అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా వీడియోలలో ఈ మహిళ ఎల్పిజి సిలిండర్లతో విభిన్న వ్యాయామాలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఈ అమ్మాయి పళ్ళతో సిలిండర్ను ఎత్తేస్తుంది. ఈ వీడియో చూసిన వారందరు ఆశ్చర్యపోయారు.

అదే సమయంలో ఇంకో వీడియోలో ఈ అమ్మాయి సిలిండర్‌ను పొట్టపై ఉంచి వ్యాయామం చేస్తోంది. ఆశ్చర్యకరంగా పొట్టపై ఉన్న సిలిండర్‌పై ఓ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని వ్యాయామం చేస్తుంది. ఈ వీడయో చూసిన నెటిజన్లు ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారని నిరూపిస్తున్నావని తెగ పొగిడేస్తున్నారు. షెల్లీ చికారా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తనను తాను సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌గా అభివర్ణించింది. ఆమె ఐటి రంగంలో పనిచేస్తుందని కూడా సమాచారం.

Banking Hours : తెలంగాణలో క్రమంగా మామూలు స్థితికి జనజీవనం.. రేపటి నుంచి బ్యాంకు పనివేళలు సైతం సాధారణ సమయాల్లోనే..

Movie Sequels: సీక్వెల్స్ తో సిద్దమవుతున్న స్టార్ హీరోలు.. టాలీవుడ్ -బాలీవుడ్ లో వరుస సీక్వెల్స్..

APSSDC Jobs : ఎయిర్‌టెల్ కంపెనీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రేపే చివరితేదీ..