AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSSDC Jobs : ఎయిర్‌టెల్ కంపెనీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రేపే చివరితేదీ..

APSSDC Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్

APSSDC Jobs : ఎయిర్‌టెల్ కంపెనీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రేపే  చివరితేదీ..
Airtel
uppula Raju
|

Updated on: Jun 09, 2021 | 6:36 PM

Share

APSSDC Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో రిక్రూట్ మెంట్ వచ్చింది. Airtel Payments Bank వారు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ప్రమోటర్ విభాగంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. సెలక్టైన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుందన్నారు. ఏపీలోని వివిధ జిల్లాలో పని చేయాల్సి ఉంటుందని సూచించారు.

టెన్త్, ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 16,133 వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు రూ. 5 వేల వరకు ఇన్సెంటీవ్స్ అందిస్తారు. అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉండాలి. వయస్సు 19 నుంచి 30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు. పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 8008742842 నంబర్లను సంప్రదించవచ్చు.

Tokyo Olympics: నాన్-బ్రాండెడ్ కిట్ తో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్ళు!

రైలు ప్రయాణాలకిక కోవిద్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరి కాదా….? వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చాలా ..? పరిశీలనలో రైల్వే శాఖ ప్రతిపాదన

ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.