ISRO Machine Learning Course: ఐదు రోజుల పాటు ఉచితంగా ఇస్రో మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సు.. ఎప్పటి నుంచి అంటే..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Jun 09, 2021 | 4:28 PM

ISRO Machine Learning Course: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూలై 5 నుంచి 9వ వరకు ఐదు రోజుల పాటు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును అందిస్తోంది. ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌..

ISRO Machine Learning Course: ఐదు రోజుల పాటు ఉచితంగా ఇస్రో మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సు.. ఎప్పటి నుంచి అంటే..!
Isro Machine Learning Course

ISRO Machine Learning Course: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూలై 5 నుంచి 9వ వరకు ఐదు రోజుల పాటు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును అందిస్తోంది. ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా ఈ కోర్సును అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పరిశోధకులు, నిపుణులు మరియు స్వచ్ఛంద సంస్థల వారు ఈ కోర్సులకు హాజరు కావచ్చు. ఆసక్తి గల అభ్యర్థులకు రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ గురించి తెలిసి ఉండాలి. అయితే ఉచితంగా అందించే ఆన్‌లైన్‌ కోర్సు వ్యవధి ఐదు రోజులు. పూర్తి కోర్సు చేసిన వారు ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌) ద్వారా కోర్సు నిర్వహించడుతుంది.

అయితే వేర్వేరు విభాగాల్లో రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ప్రాసెసింగ్‌లో నిమగ్నమైన నిపుణుల కోసం ఈ కోర్సులను ప్రారంభించింది ఇస్రో. అయితే జూలై 5న రిమోట్‌ సెన్సింగ్‌, వివిధ సెన్సార్లు, రేడియోమెట్రి, రేఖాగణిత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. జూలై 6 న యంత్ర విభాగంపై, జూలై 7న యంత్ర అభ్యాసంలో పద్దతులు, పర్యవేక్షించే విధానం, జూలై 8న తాత్కాలిక డేటా ప్రాసెసింగ్‌లో అనువర్తనంపై, జూలై 9, నెట్‌ వర్క్‌, వివిధ టెక్నికల్‌ పద్దతులపై కోర్సు ఉంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. అయితే ఐఐఆర్‌ఎస్‌ డెహ్రాడూన్‌ ఇ-క్లాస్‌ పోర్టల్‌ ద్వారా అభ్యర్థులు హాజరు కావచ్చు. ఏదైనా వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా ప్రత్యక్షంగా కోర్సుకు హాజరు కావచ్చు. ఆ తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు క్లాసు కొనసాగుతుంది.

ఇందులో పాల్గొనే ఐఐఆర్‌, యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రత్యక్ష వర్క్‌షాప్‌నకు హాజరు కావచ్చు. అయితే కోర్సు పూర్తి చేసిన తర్వాత ధృవీకరణ పత్రాన్ని స్వీకరించడానికి ఒక విద్యార్థి ఇ-క్లాస్‌ పోర్టల్‌ ద్వారా 70శాతం సెషన్లకు హాజరు అయి ఉండాలి. రిజిస్ట్రేషన్‌, కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలకు 0135-2524114 ద్వారా కోర్సు సమన్వయ కర్త డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ను సంప్రదించవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంకు ఆఫీసర్‌ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూన్‌ 30

Old Rs 10 Note: పాత 10 రూపాయల నోటు మీ వద్ద ఉందా..? అయితే మీరు లక్షాధికారి కావచ్చు.. ఎలాగంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu