AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Students Confusion: కాలేజీ రమ్మంటోంది.. కరోనా వద్దంటోంది.. మానసిక ఆందోళనలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు..!

ఇంటర్‌ విద్యార్థి ఉన్న ప్రతి ఇంటిలో ఏదో ఒక టెన్షన్‌. మొన్నటి వరకు క్లాస్‌లు జరుగకున్నా లక్షల్లో పీజులు చెల్లించాలన్న ఆందోళన. ఇప్పుడు పరీక్షలపై ఎక్కడ లేని మానసిక ఆందోళన.

Inter Students Confusion: కాలేజీ రమ్మంటోంది.. కరోనా వద్దంటోంది.. మానసిక ఆందోళనలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు..!
Intermediate Students Confusion On Exams
Balaraju Goud
|

Updated on: Jun 09, 2021 | 9:49 AM

Share

Intermediate Students Confusion On Exams: ఇంటర్‌ విద్యార్థి ఉన్న ప్రతి ఇంటిలో ఏదో ఒక టెన్షన్‌. మెంటల్‌ టార్చర్‌తో కుంగిపోతున్నారు. మొన్నటి వరకు క్లాస్‌లు జరుగకున్నా లక్షల్లో పీజులు చెల్లించాలన్న ఆందోళన. క్లాస్‌ రూమ్‌ చదువు లేక పోవడంతో ఏంటోనన్న నిరాశ. ఇప్పుడు పరీక్షలపై ఎక్కడ లేని మానసిక ఆందోళన. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తోంది. ఎందుకంటే.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయా? ఉండవా? ఉంటే ఎప్పుడుంటాయి? అన్న ప్రశ్నలే విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయి.

కరోనా సెకండ్‌ వేవ్‌తో.. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఈ నెలలో సమీక్ష చేస్తామన్నా ఆ ఊసే లేదు. అయితే.. తొలి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేశామని ప్రకటించింది. అయినా ప్రభుత్వం ఓ తిరకాసు పెట్టింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపి కొత్త టెన్షన్‌ పెట్టించింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4లక్షల 59 వేల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లోనూ ప్రస్తుతం అయోమయం నెలకొంది.

సార్‌! విద్యార్థులను ప్రమోట్‌ చేసినట్లే చేసి మళ్లీ భవిష్యత్తులో పరీక్షలు నిర్వహిస్తే ఎలా చదవగలడు? ప్రథమ సంవత్సరం పరీక్షలకు చదవాలా? ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవ్వాలా? అన్న ప్రశ్నలు ప్రతి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి పేరెంట్స్‌ను తికమక పెడుతున్నాయి. ఎందుకంటే.. విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు, పరీక్షల భయం తదితర అంశాలపై ఏడుగురు సైకాలజిస్టులతో ఓ కాల్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కువ ప్రశ్నలు కూడా పరీక్షలపైనే వచ్చాయంటున్నారు. అసలు పరీక్షలు నిర్వహిస్తారా? అయితే ఎప్పుడు? లేకుంటే మార్కులెలా ఇస్తారు? అనే ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయని సైకాలజిస్టులు తెలిపారు.

ఇక ఇంటర్ సెకండియర్ విద్యార్థుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పరీక్షలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే అదెప్పుడు…? విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే ఫలితాలను ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్న దానిపై కమిటీ వేసింది. ఇవాళో రేపో కూడా ఆ రిపోర్ట్‌ ప్రభుత్వానికి చేరుకుంది. దీంతో తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివేవారి పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. పరీక్షలను రద్దు చేస్తారా..? నిర్వహిస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు.

సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి కాబట్టి.. ఈ పరీక్షలు కూడా రద్దవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని ఆప్షన్స్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయో దానిపై వివరాలు తెప్పించుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 2వ వారంలో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రానికి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.

అయితే.. పరీక్షలకు ఇంకా సమయం వుందన్న భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గించడం, సగం ప్రశ్నలే ఇవ్వడం ఇలాంటి అంశాలను కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. పరీక్షలు నిర్వహించలేని పక్షంలో ఫలితాలు ఇవ్వడానికి వున్న ప్రత్యామ్నాయాలు ఏంటన్న దానిపై ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్‌ ఇచ్చారు.

మొదటి సంవత్సరం మార్క్స్ ఆధారంగా ఫలితాలు ప్రకటించడంతో పాటు ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్ధుల సంఖ్య 4లక్షల 74వేలు వుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బ్యాక్ లాగ్ వుంటే.. మినిమమ్ పాస్ మార్కులతో పాస్ చేస్తామని ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంటర్ సెకండియర్ పరీక్షలపై మాత్రం క్లారిటీ లేకపోవడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Read Also….  Telangana: లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగింపు.. సడలింపు వీటిపైనే… ( వీడియో )