NTPC Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ NTPCలో 280 ఉద్యోగాలు.. ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.. దరఖాస్తులకు రేపే ఆఖరు..
NTPC Recruitment 2021: కరోనా కష్టంలోనూ.. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (NTPC)
NTPC Recruitment 2021: కరోనా కష్టంలోనూ.. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (NTPC) పలు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 280 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.40 లక్షల వరకు వేతనం అందిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి జూన్ 10 చివరితేదీ.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను గేట్ పరీక్షలో వచ్చిన మార్కుల అధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారై ఉండాలి.
అర్హతలు.. ఈ ఉద్యోగాలకు ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ & హై ఓల్టేజ్, మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్ కోర్సుల్లో బీటెక్ పూర్తిచేసినవారు.. అలాగే.. పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ తదితర కోర్సుల్లో బీటెక్ చేసిన వారు అర్హులు.
అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 21 నుండి ప్రారంభం కాగా దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు గేట్ 2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ntpccareers.net/ వెబ్సైట్లో చూడవచ్చు.
Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?