AIIMS PG Exam 2021: ఎయిమ్స్ పీజీ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయా?.. అసలు నిజం ఇదీ..!
AIIMS PG Exam 2021: జూన్ 16, 2021 న నిర్వహించాల్సిన ఎయిమ్స్ పీజీ పరీక్ష యధావిధిగా జరుగుతాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్...
AIIMS PG Exam 2021: జూన్ 16, 2021 న నిర్వహించాల్సిన ఎయిమ్స్ పీజీ పరీక్ష యధావిధిగా జరుగుతాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. పరీక్షలను వాయిదా వేయలేదని తేల్చి చెప్పారు. ఎయిమ్స్ పరీక్షలు వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. అసలు నిజం ఇదీ పలు వివరాలు వెల్లడించారు.
‘‘జూన్ 16, 2021 న నిర్వహించాల్సిన ఎయిమ్స్ పీజీ పరీక్ష-2021 ఇంకా వాయిదా వేయలేదు. ఎయిమ్స్ పీజీ ఎగ్జామ్-2021 వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న నోటీసు నకిలీది. విద్యార్థులు వాటిని నమ్మొద్దు. పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. ఎయిమ్స్ ఐఎన్ఐ సెట్ పరీక్ష-2021 కొరకు అడ్మిట్ కార్డు జూన్ 9 నుండి జారీ చేయడం జరుగుతుంది.’ అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పీజీ ఎగ్జామ్ 2021 జూన్ 16, 2021 న నిర్వహించాల్సి ఉంది. ఎయిమ్స్ ఐఎన్ఇ సిఇటి ఎగ్జామ్ 2021 కొరకు అడ్మిట్ కార్డు జూన్ 9 నుండి జారీ చేయనున్నారు. ఇంతలో కొందరు ఈ ప్రవేశ పరీక్ష వాయిదా పడిందంటూ నకిలీ నోట్ ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. “ఎయిమ్స్ పిజి ఎగ్జామ్ 2021 వాయిదా పడింది. వెబ్‌సైట్ aiimsexams.ac.in ద్వారా సవరించిన పరీక్ష తేదీలు నిర్ణీత సమయంలో తెలియజేయబడతాయి.” అని నకిలీ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఫేక్ నోట్ గురించి తెలుసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పరీక్షల నిర్వహణపై విద్యార్థులకు క్లారిటీ ఇచ్చారు. ఎయిమ్స్ పిజి ఎగ్జామ్ 2021 కు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ aiimsexams.ac.in లో మాత్రమే చెక్ చేసుకోవాలని, ఇతర వేటినీ నమ్మవద్దని సూచించారు. అంతేకాదు.. నకిలీ వార్తలకు వ్యతిరేకంగా విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఎస్ఎంఎస్ పంపుతున్నామని ఎయిమ్స్ అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఎయిమ్స్ పిజి ఎగ్జామ్-2021 షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ముందు కొందరు విద్యార్థులు పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 80,000 మంది విద్యార్థులు పిజి పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షను మరో తేదీకి వాయిదాలని కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్ అధికారులను విద్యార్థులు కోరారు. కాగా, ఎయిమ్స్ పిజి పరీక్ష 2021 ప్రారంభంలో మే 8, 2021 న షెడ్యూల్ చేయబడింది. తరువాత ఇది 2021 జూన్ 16 కి వాయిదా పడింది.
Also read:
Tokyo Olympics: కోచ్‌లు, ఫిజియోల సంఖ్యను పెంచండి …ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ