Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ అభివృద్దికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం.. గ్లోబల్ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు అగ్రనటుడు చిరంజీవి హాజరయ్యారు. ఆయన రాకతో ఫ్యూచర్ సిటీలో సందడి వాతావారణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత గొప్ప సభలో పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా (Telangana Global Summit 2025) సినీపరిశ్రమ నుంచి నిర్మాత సురేష్ బాబు, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వీరితోపాటు ఉపముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జెనీలియా, అక్కినేని అమల, పలువురు తెలుగు, హిందీ సినీప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. 24 క్రాఫ్ట్ లో సినిమా ఇండస్ట్రీకి అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సినీవర్గాలకు సీఎం సూచించారు. అలాగే ఈకార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇంత గొప్ప అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
చిరు మాట్లాడుతూ.. “ఇంత గొప్ప సభకు నాకు ఆహ్వానం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చిరంజీవికి వచ్చిన ఆహ్వానం కాదు. సినీ ఇండస్ట్రీ తరుపున ఆహ్వానం వచ్చింది. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మార్చాలని రేవంత్ అన్నారు. ఇతర భాషల వాళ్లు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్స్ చేసుకోవాలని సీఎం రేవంత్ చెబుతూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ పూర్తి సహకారం అందిస్తున్నారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీ అభివృద్దికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. హైదరాబాద్ ను ప్రపంచానికి సినీ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాము. విభిన్న రంగానికి చెందిన నిష్ణాతులు ఇక్కడ ఉన్నారు ” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
యువత చెడు వ్యసనాల వైపు మళ్లకుండా చిత్ర పరిశ్రమ చేయగలదు. ఇదే ఆలోచనతో కొరియా ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రొత్సహించింది. స్కిల్ డెవలప్మెంట్ చేస్తే చాలు అనుకున్నది సాధించగలం. అత్యాధునిక స్టూడియోలు పెట్టేందుకు ఇప్పటికే ఎంతో మంది ఇక్కడకు వచ్చారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందితే జీడీపీకి కూడా ఎంతో ఉపయోగం. చిత్ర పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ నేర్పే అకాడమీ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించామని అన్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..




