AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan2: మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌-2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! ఎప్పుడంటే?

పొన్నియన్‌ సెల్వన్‌ రెండు పార్టులుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా రెండో  భాగానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు తమిళ సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Ponniyin Selvan2: మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌-2 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! ఎప్పుడంటే?
Ponniyin Selvan
Basha Shek
|

Updated on: Nov 06, 2022 | 8:44 PM

Share

లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కించిన పొన్నియన్‌ సెల్వన్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌, ఐశ్వర్యా లక్ష్మీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ గ్రాండియర్‌ మూవీ తమిళనాట బిగ్టెస్ట్‌ హిట్‌గా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ మోస్తరు కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు రూ.460 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడీ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లోనూ సందడి చేస్తోంది. కాగా  మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో  భాగానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు తమిళ సినిమా ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఇదే డేట్‌పై చర్చ నడుస్తోంది.  త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తుంది.

కాగా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. తమిళ్‌ బాహుబలిగా ముద్రపడిన ఈ సినిమా అందుకు తగ్గట్లే కోలీవుడ్‌లో భారీ కలెక్షన్లను రాబట్టింది. అంత కాకున్నా తెలుగులోనూ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఐశ్వర్యారాయ్‌, ప్రకాశ్‌రాజ్‌ లాంటి ప్యాన్‌ ఇండియా స్టార్లు ఉండడంతో హిందీలోనూ మంచిగానే కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ లడ్డు రోజుకోటి తింటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
ఈ లడ్డు రోజుకోటి తింటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
ఇలా ఇంట్లో కోడి బిర్యానీ చేస్తే బయటవి టచ్ కూడా చెయ్యరు..
ఇలా ఇంట్లో కోడి బిర్యానీ చేస్తే బయటవి టచ్ కూడా చెయ్యరు..
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్ల సూచన
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్ల సూచన
ఈ టాలీవుడ్ హీరోయిన్ శ్రీనివాస రామానుజన్‌కు ముని మనవరాలుఅవుతుందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ శ్రీనివాస రామానుజన్‌కు ముని మనవరాలుఅవుతుందా?
ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా?దీని వెనకున్న రహస్యం ఇదే
ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా?దీని వెనకున్న రహస్యం ఇదే
రోహిత్ రిటైర్మెంట్‌పై ఆకాష్ చోప్రా భావోద్వేగ కామెంట్స్
రోహిత్ రిటైర్మెంట్‌పై ఆకాష్ చోప్రా భావోద్వేగ కామెంట్స్
అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్!
అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్!
రాత్రి పూట ఈ నీటిని తాగితే మరుసటి రోజు ఉదయం మలబద్ధకం మాయం!
రాత్రి పూట ఈ నీటిని తాగితే మరుసటి రోజు ఉదయం మలబద్ధకం మాయం!
వీళ్లు కాలికి నల్లదారం కట్టుకుంటే ప్రమాదం!
వీళ్లు కాలికి నల్లదారం కట్టుకుంటే ప్రమాదం!
కొత్తిమీరను కట్టలుగా కట్టి మాత్రమే ఎందుకు అమ్ముతారో తెలుసా?
కొత్తిమీరను కట్టలుగా కట్టి మాత్రమే ఎందుకు అమ్ముతారో తెలుసా?