AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Movie: కన్నప్ప రిలీజ్‌.. వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ .. అలా చేస్తే సహించేదిలేదంటూ..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు మార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

Kannappa Movie: కన్నప్ప రిలీజ్‌.. వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ .. అలా చేస్తే సహించేదిలేదంటూ..
Manchu Vishnu
Basha Shek
|

Updated on: Jun 25, 2025 | 8:08 PM

Share

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన హిస్టారికల్ మూవీ ‘కన్నప్ప’. అలాగే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. సుమారు రూ. 300 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక సినిమా విడుదల మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం (జూన్ 27) ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. ఇ‍ప్పుడు మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మంచు విష్ణు టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది.

కన్నప్ప సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు మేం పొందాం. ఇక సినిమా విమర్శకులు ముందుగా మా సినిమా చూడాలి. సినిమాలోని కంటెంట్‌ను గౌరవించాలి. మా సినిమా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు . అలాగనీ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను మేం గౌరవిస్తాము. అలాగనీ ద్వేషపూరిత భాషను సహించలేం. కేరళ హైకోర్టు ఇటీవల ఉత్తర్వుల ప్రకారం, ఏదైనా సృజనాత్మక కళను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం లేదా కించపరచడం నేరం అని తీర్పు చెప్పింది. అలాగే సోషల్ మీడియాలో లేదా ఏదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మా సినిమా కు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించడం కూడా నిషేధం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించం. అలా చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే సింపుల్‌గా చెప్పుకొంటే కన్నప్ప సినిమాకు సంబంధించిన ఎవరైనా క్రిటిక్స్, యూట్యూబర్స్ నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు నోట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .