AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు హర్షవర్ధన్. మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లో టీమ్ మెంబర్ గా నటించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైన ఆయన మందు బాబులకు కొన్ని మంచి సూచనలు ఇచ్చాడు.

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది
Actor Harsha Vardhan
Basha Shek
|

Updated on: Jan 24, 2026 | 10:10 PM

Share

ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారీ ట్యాలెంటెడ్ నటుడు. అందులో గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. దీంతో పాటు శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. సీరియల్స్ తో పాటు కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనూ ఈ నటుడు యాక్ట్ చేశారు. మధ్యలో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇప్పుడు సహాయక నటుడిగా బిజీ బిజీగా ఉంటున్నాడు. కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, అతడు, రాఖీ, స్టాలిన్, లక్ష్మీ కల్యాణం, లీడర్, పౌర్ణమి, గోల్కొండ హైస్కూల్, లవ్లీ, గబ్బర్ సింగ్, గోవిందుడు అందరి వాడేలే, గీతాంజలి, బ్రూస్లీ, ఊపిరి, 118, బ్రోచేవారెవరురా, జాంబిరెడ్డి, అక్షర, ఏక్ మినీ కథ, పుష్పక విమానం, సేనాపతి, స్వాతి ముత్యం, హిట్ ది సెకెండ్ కేస్, సుందరం మాస్టర్, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, కోర్టు, పరదా తదితర సూపర్ హిట్ సినిమాల్లో హర్షవర్దన్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీలోనూ ఓ కీరోల్ పోషించారు హర్షవర్ధన్.

ప్రస్తుతం మన శంకరవర ప్రసాద్ గారు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో మందుబాబులకు కొన్ని మంచి సూచనలు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

‘ఒక పెగ్గు మద్యం తాగిన తర్వాత కచ్చితంగా గ్లాస్ నీళ్లు తాగాలి. అలా ప్రతి పెగ్గుకు నీళ్లు తాగడం వల్ల శరీరం పైన మద్యం ప్రభావం తగ్గుతుంది. ఈ విషయాన్ని నేను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నుంచి నేర్చుకున్నాను. డ్రింక్ చేయడానికి ముందు ఆయన అర లీటర్ నీళ్లు తాగుతారు. ఇలా తాగడం వల్ల కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఆయన చెప్పారు’ అంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

మందుబాబులకు హర్షవర్దన్ సలహా.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి