AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు : మురళీధర్ గౌడ్

కమెడియన్ వేణు దర్శకుడిగా మారి చేసిన సినిమా బలగం. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నటుడు మురళీధర్ గౌడ్. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీధర్ గౌడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు

ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు : మురళీధర్ గౌడ్
Actor Muralidhar Goud
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2026 | 8:01 AM

Share

బలగం సినిమాతో అద్భుతమైన గుర్తింపు పొందిన నటుడు మురళీధర్ గౌడ్. ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ మెప్పించారు మురళీధర్ గౌడ్. గతంలో మురళీధర్ గౌడ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందా అని యాంకర్ ప్రశ్నించగా.. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా అవకాశంతో పాటు తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజమేనని, అయితే తన పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు షూటింగ్ కు కూడా హాజరైన తర్వాత, దర్శకుడు హరీష్ శంకర్ ఆయన పాత్రను మార్చేశారని మురళీధర్ గౌడ్ వివరించారు.

అయితే, తన పాత్ర మార్చినందుకు నిరాశ చెందలేదు అని అన్నారు. పెద్ద బ్యానర్, పెద్ద స్టార్, పెద్ద డైరెక్టర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన కెరీర్‌కు ఒక గొప్ప మెట్టు అని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోనూ తాను ఒక జడ్జి పాత్రలో కొన్ని సెకన్ల పాటు మూడు సార్లు కనిపించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో పూర్తిస్థాయి క్యారెక్టర్‌లో దాదాపు 20 నుండి 30 రోజుల పాటు ప్రయాణం చేయాలని ఆశించానని, అందుకే ఆ విషయం గురించి ముందే పంచుకున్నానని ఆయన అన్నారు. హరీష్ శంకర్ చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

సెట్‌లో పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడే అవకాశం లభించలేదని, అయితే ఆయనకు నమస్కారం చేసే అవకాశం దొరికిందని మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. తన స్థాయిని, పరిమితులను తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా దూరం పాటిస్తానని చెప్పారు. ఇండస్ట్రీలో అందరు హీరోలంటే తనకు ఇష్టమని, అందరితోనూ పనిచేయాలని ఉందని ఆయన తెలిపారు. చిన్న దర్శకులైనా, పెద్ద దర్శకులైనా, ఏ సినిమా అయినా సరే, పాత్ర తనకు సరిపోతుందని దర్శకుడు భావిస్తే ఆ పాత్రను అద్భుతంగా చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. దర్శకులను సంతృప్తి పరచడమే తన లక్ష్యమని మురళీధర్ గౌడ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
జర భద్రం.. జూన్ నెలలో కుంభ రాశి వారికి దిన దిన గండమే!
జర భద్రం.. జూన్ నెలలో కుంభ రాశి వారికి దిన దిన గండమే!
JEE Advanced 2026 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే
JEE Advanced 2026 ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే
అందాన్ని రెట్టింపు చేసే విటమిన్-C సీరమ్..ఇంట్లోనే ఇలా తయారుచేయండి
అందాన్ని రెట్టింపు చేసే విటమిన్-C సీరమ్..ఇంట్లోనే ఇలా తయారుచేయండి
ఒకవేళ పాలసీని మధ్యలోనే వదిలేస్తే ఇక నష్టం ఉండదు.. కీలక మార్పులు!
ఒకవేళ పాలసీని మధ్యలోనే వదిలేస్తే ఇక నష్టం ఉండదు.. కీలక మార్పులు!
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..