AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో కాస్ట్ EMI అనగానే ఎగబడి కొంటున్నారా? దాని అసలు కథ తెలిస్తే వామ్మో అంటారు!

నో-కాస్ట్ EMI ఆఫర్‌లు ఆకర్షణీయంగా కనిపించినా, వాటి లో దాచిన వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లు ఉంటాయి. సాధారణంగా, మీరు నగదు చెల్లింపుపై పొందే డిస్కౌంట్‌ను EMI వడ్డీకి సర్దుబాటు చేస్తారు. ఇది కొనుగోలుదారులకు తెలియకుండానే అధిక ధర చెల్లించేలా చేస్తుంది.

SN Pasha
|

Updated on: Jan 24, 2026 | 8:57 PM

Share
పలు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు నో కాస్ట్‌ ఈఎంఐ అనే ఒక ఆఫర్‌ను ఇస్తుంది. అంటే ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేయవచ్చు. దీన్ని బౌ నౌ అండ్‌ పే లేటర్‌ అని కూడా అంటారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుండి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ల వరకు, ఈ రోజుల్లో ప్రతి ఖరీదైన వస్తువుపై నో-కాస్ట్ EMIపై లభిస్తున్నాయి. చాలా మంది కొనుగోలుదారులు వడ్డీ చెల్లించకుండా వాయిదాలలో వస్తువులను పొందగలిగితే లాభదాయకమే కదా అనుకుంటారు. పైకి ఇది లాభదాయకంగా అనిపించినా, దాని వాస్తవికత అంతే సంక్లిష్టంగా ఉంటుంది.

1 / 5
మొదట నో-కాస్ట్ EMIల వెనుక ఉన్న లెక్కను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి బ్యాంకులు ఈ EMIలపై వడ్డీని వసూలు చేస్తాయి. ఒకే తేడా ఏమిటంటే వడ్డీ మీ నుండి నేరుగా వసూలు చేయరు, కానీ ఉత్పత్తి ధరలో దాగి ఉంటుంది. ఇది సాధారణంగా రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదట విక్రేత వడ్డీ మొత్తాన్ని డిస్కౌంట్‌గా ప్రదర్శిస్తాడు, ఇది వాస్తవానికి వడ్డీ. దీని అర్థం మీరు నగదు చెల్లింపుపై పొందే డిస్కౌంట్ వడ్డీని కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. కస్టమర్ తాము ఎటువంటి వడ్డీని చెల్లించలేదని అనుకుంటాడు, వాస్తవానికి వారు ఆ ప్రొడక్ట్‌కు ఎక్కువ ధర చెల్లిస్తారు.

2 / 5
నో-కాస్ట్ EMI ఎంచుకునేటప్పుడు కొనుగోలుదారులు క్యాష్‌ డిస్కౌంట్‌ లేదా కార్డ్ ఆఫర్‌లను కోల్పుతుంటారు. మీరు ఒక వస్తువుకు పూర్తిగా చెల్లిస్తే, మీకు తక్షణ తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ లభించే అవకాశం ఉంది. అయితే మీరు నో-కాస్ట్ EMIని ఎంచుకున్న వెంటనే ఈ ఆఫర్‌లు ఇవ్వరు. ఉదాహరణకు ఒక ఫోన్ ధర రూ.50,000 అనుకుందాం, రూ.5,000 తక్షణ నగదు తగ్గింపును అందిస్తోంది. మీరు EMI ఎంచుకుంటే, ఫోన్ ధర ఇప్పటికీ రూ.50,000 అవుతుంది. అంటే మీరు రూ.5,000 ఎక్కువ చెల్లించాలి. ఈ మొత్తం బ్యాంకు వడ్డీకి సమానం లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.

3 / 5
ప్రాసెసింగ్ ఫీజు అదనం.. ఇది కేవలం వడ్డీ లేదా డిస్కౌంట్ల గురించి మాత్రమే కాదు. మీరు EMI మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, బ్యాంకులు తరచుగా మీ నుండి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి. ఇంకా డిస్కౌంట్‌గా సర్దుబాటు చేయబడిన వడ్డీ మొత్తం తరచుగా GSTకి లోబడి ఉంటుంది. ఇది వస్తువు ధరకు అదనంగా ఉంటుంది.

4 / 5
అదనంగా ఇది మీ క్రెడిట్ హిస్టరీని ప్రభావితం చేస్తుంది. EMIలు తీసుకోవడం వల్ల మీ క్రెడిట్ ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. దీని అర్థం బ్యాంక్ మిమ్మల్ని అప్పుగా చూస్తుంది, ఇది భవిష్యత్తులో పెద్ద రుణం పొందే అర్హతను ప్రభావితం చేస్తుంది.

5 / 5