అందం అభినయం ఉన్న.. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మ

25 Januaryr2026

Rajeev 

 అందం అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు.

సినిమా అవకాశాలు అందుకుంటున్నా కూడా సరైన హిట్స్ లేక స్టార్ డమ్ తెచ్చుకోలేకపోతున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. వారిలో డింపుల్ హయాతి ఒకరు.

అందం అభినయం ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ తన వయ్యారంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ చేసింది.

అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసింది. 

రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.