Kannappa: పుష్ప 2 కారణంగానే కన్నప్ప రిలీజ్‌ను వాయిదా వేశారా? హీరో మంచు విష్ణు సమాధానమిదే

ఓవైపు కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ఆ టీమ్ సభ్యులు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శంచుకుంటున్నారు.ఇందులో భాగంగా మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్‌నాథ్ తో పాటు పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకున్నారు.

Kannappa: పుష్ప 2 కారణంగానే కన్నప్ప రిలీజ్‌ను వాయిదా వేశారా? హీరో మంచు విష్ణు సమాధానమిదే
Manchu Vishnu
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 8:10 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమారో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు నయన తార, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా తదితర స్టార్ నటీనటులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా మొదట ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా పడింది. దీనికి గల కారణాన్ని వివరించాడు హీరో మంచు విష్ణు. శుక్రవారం (నవంబర్ 29) కన్నప్ప ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అతను మూవీ ఆలస్యం కావడానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే కారణమని క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే కార్యక్రమంలో అల్లు అర్జున్ ‘పుష్ప2’ వస్తోన్న కారణంగానే డిసెంబరులో విడుదల కావాల్సిన ‘కన్నప్ప’ను ఏప్రిల్‌లో విడుదల వాయిదా వేశార? అని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనికి మంచు విష్ణు ఇలా సమాధానం ఇచ్చారు. ‘కన్నప్ప, పుష్ప 2.. ఈ రెండు సినిమాల డిస్టిబ్యూట‌ర్లు ఒక్క‌రే. ఆ విష‌యం త్వరలోనే మీకు తెలుస్తుంది. క‌న్న‌ప్ప డిసెంబ‌రులో రాలేదేంటి? అని ఎవ‌రూ అడ‌గ‌రు. ఓ మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్ష‌కులు ఆదరిస్తారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలతో మాట్లాడి స్పేస్ ఇచ్చి రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వీఎఫ్ ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కాలేదు. పారిస్ లో ఓ సీక్వెన్స్ జరుగుతుంది అవి పూర్తికావడానికి డిసెంబర్ అవుతుంది. మంచి చిత్రాన్ని జనాలకు రీచ్ చేయడానికి ఏప్రిల్ కంఫర్టబుల్ గా ఉంటుందని రిలీజ్ అప్పుడు పెట్టుకున్నాం. అన్నీ ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.