Hanuman- Manchu Manoj: ‘నాకు, నా కొడుక్కి గూస్ బంప్స్ తెప్పించావ్ తేజా’.. ‘హనుమాన్’ పై మంచు మనోజ్ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లోనూ హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ హనుమాన్ సినిమాను వీక్షించాడు.

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ దూకుడు అసలు తగ్గడం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లు దాటేసిన హనుమాన్ రూ.200 కోట్ల వసూళ్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లోనూ హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ హనుమాన్ సినిమాను వీక్షించాడు. అనంతరం తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ‘మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాతో నాకు, హనుమాన్‌తో మా అబ్బాయి ధైరవ్‌కి గూస్‌బంప్స్ తెప్పించావ్ కదా తమ్ముడు తేజా. కిల్లింగ్ పర్ఫామెన్స్ తో, నీ యాక్టింగ్ తో అదరగ్గొట్టేశావు. 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ ని కవర్ చేశావు. ప్రశాంత్ వర్మ నుంచి ఒక అద్భుతమైన మూవీ వచ్చింది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ప్రశాంత్ వర్మ. సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు. అందరూ అదరగొట్టేశారు’ అంటూ ట్వీట్ చేశారు మనోజ్.
ప్రస్తుతం మంచు మనోజ్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ కూడా హనుమాన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తేజ హీరో తేజ సజ్జాను ఘనంగా సత్కరించారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా హనుమాన్ ను కొనియాడింది. చిత్ర బృందంకు అభినందనలు తెలిపింది. హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శీను తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.
మంచు మనోజ్ ట్వీట్..
#Indra tho naaku, #HanuMan tho ma Abbai Dhairav ki… Goosebumps teppinchaav kada thammudu @tejasajja123. Killer performance! Iraggotesaav!!!! 28 years ke Rendu Generations ni Cover Chesav💫
An amazing film by the one and only @prsanthvarma garu. Super proud of you my brother… pic.twitter.com/UdUeB3kSCT
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2024
సంక్రాంతి సంబరాల్లో మనోజ్ ఫ్యామిలీ..
“Happy Bhogi 2024! 🔥 Embracing renewal with @namastheworld , my wife @BhumaMounika , Dhairav, our upcoming joy, and our team. This Bhogi, let’s burn away negativity and bring in positivity. Share your Bhogi moments! #Bhogi2024 #Renewal #TeamSpirit” pic.twitter.com/TrEC1PP3B4
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 14, 2024








