Prabhas: అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్.. సీతారామం డైరెక్టర్‌తో డార్లింగ్ సినిమా కన్ఫార్మ్ !..
సలార్ తర్వాత ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD, డైరెక్టర్ మారుతీతో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ ఖాతాలో మరోసారి హిట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. కల్కి సైన్స్ ఫిక్షన్ కాగా.. రాజా సాబ్.. లవ్ కామెడీ హారర్ మూవీగా ఉందనుంది. దీంతో ఈ సినిమాలపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందులో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ ఒకటి.

సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ప్రభాస్ నెక్ట్స్ మూవీస్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంతో బాహుబలి తర్వాత ఆ రేంజ్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు డార్లింగ్. దీంతో ఇప్పుడు ఫ్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. తమ హీరో నుంచి రాబోయే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ తర్వాత ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD, డైరెక్టర్ మారుతీతో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ ఖాతాలో మరోసారి హిట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. కల్కి సైన్స్ ఫిక్షన్ కాగా.. రాజా సాబ్.. లవ్ కామెడీ హారర్ మూవీగా ఉందనుంది. దీంతో ఈ సినిమాలపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందులో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ ఒకటి. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ నుంచి మరో అందమైన ప్రేమకథ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సీతారామం మూవీతో హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, హను రాఘవపూడి సినిమాకు చేయబోతున్నానని అన్నారు. దీంతో ప్రభాస్ నెక్ట్స్ మూవీ హను రాఘవపూడితో ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. హను ఇప్పటివరకు క్లాస్ సినిమాలు తీస్తూ అందరిని మెప్పించాడు. సీతారామం సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ ను అలరించాడు. ఇక ఈసారి డార్లింగ్ ఖాతాలో మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీని అందించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే విడుదలైన వీడియోస్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే రాజా సాబ్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




