Tollywood: ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్.. అస్సలు మారలేదు..
ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో ఉన్న హీరోయిన్ కేవలం ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. 2014లో తెలుగు తెరకు పరిచయమైంది. దాదాపు 9 ఏళ్లుగా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?..

హీరోయిన్ అంటే అభినయం మాత్రమే కాదు.. అంతకు మించి అందం, శరీరాకృతి కూడా ముఖ్యమే. ప్రస్తుతం హీరోయిన్ తమ ఫిట్నెస్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. నలభై, యాభై ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. త్రిష, శ్రియా, కాజల్, ఐశ్వర్య రాయ్, మంజు వారియర్ వంటి స్టార్ హీరోయిన్స్ ఇప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తుంటారు. రోజు జిమ్ వర్కవుట్స్ చేయడం.. కచ్చితమైన డైట్ ఫాలో కావడం హీరోయిన్స్ ఫిట్నెస్ రహస్యం. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో ఉన్న హీరోయిన్ కేవలం ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. 2014లో తెలుగు తెరకు పరిచయమైంది. దాదాపు 9 ఏళ్లుగా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ సీరత్ కపూర్.
2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. కానీ ఈ బ్యూటీకి మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. టైగర్, కొలంబస్, రాజు గారి గది, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం, మా వింత గాధ వినుమా సినిమాల్లో నటించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు చక్కని ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నారు సీరత్. తాజాగా తన డైట్ సీక్రెట్ షేర్ చేసుకున్నారు.
View this post on Instagram
సీరత్ డైట్ అస్సలు చేయరట.. స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తింటారట. ఇటాలియన్ ఫుడ్ అంటే మరింత ఇష్టమని.. కానీ ఎంత తినాలి అనేది తన బాడీ చెబుతుందని అంటుంది. ఉదయం లేవగానే వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకుని తాగుతారట. అలాగే షూటింగ్స్ ఉన్నా సరే ఇంట్లో ఫుడ్ తినడం.. షూటింగ్ లలో కాస్త బ్రేక్ దొరికితే విదేశాలకు వెకేషన్లకు వెళ్తారట. అలాగే ఎక్కువగా జిమ్ వర్కవుట్స్ చేస్తూ.. ట్రైనర్ సూచనలు పాటిస్తారట సీరత్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




