Manchu Lakshmi: కొత్త దంపతులపై ఆసక్తికర పోస్ట్ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్..
మార్చి 3న శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక వివాహం ఘనంగా జరిగింది. ముందు నుంచి తమ్ముడి పెళ్లి బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్మి. ఈ వేడుకకు సంబంధించి హల్ది, మెహందీ ఫంక్షన్స్ నుంచి వివాహ వేడుక వరకు అన్నింటా తానే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

డైలాగ్ కింగ్ తనయుడు మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు.. సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇది వీరిద్దరికి రెండో వివాహం. గతంలో మనోజ్ .. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. 2019లో పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకున్నారు. మరోవైపు భూమా మౌనిక రెడ్డికి సైతం బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికాగా.. తక్కువ సమయంలోనే వీరు విడిపోయారు. అయితే కొద్దిరోజులుగా మనోజ్, మౌనిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయగా.. ఆ వార్తలకు పెళ్లితో ముగింపు పలికారు. మార్చి 3న శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక వివాహం ఘనంగా జరిగింది. ముందు నుంచి తమ్ముడి పెళ్లి బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్మి. ఈ వేడుకకు సంబంధించి హల్ది, మెహందీ ఫంక్షన్స్ నుంచి వివాహ వేడుక వరకు అన్నింటా తానే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.
తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. వివాహానికి ముందే ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలయ్యింది. ఇక అదే ఫోటోను షేర్ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు తెలిపారు మనోజ్. ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. విడాకుల అనంతరం ఒంటరి అయిన మనోజ్.. ఇప్పుడు ఓ ఇంటివాడు కావడంతో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనైంది.




పెళ్లి అనంతరం మౌనిక.. మోహన్ బాబును పట్టుకుని ఏడ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు అంటూ రెండు హార్ట్ ఎమోజీలను జత చేసింది. ఇదిలా ఉంటే.. పెళ్లి అనంతరం ఆదివారం ఉదయం సతీమణి మౌనిక రెడ్డితో కలిసి అత్తారింటికి బయలుదేరారు మంచు మనోజ్. మొదట వీరు పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారని సమాచారం. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు.. కాన్వాయ్‌లతో వీరి ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
And they lived happily ever after? @HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/b2GfcCSChl
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
