AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: లిఫ్టులో నటుడు అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన హీరోయిన్.. ఆ తర్వాత..

ఇప్పటికే నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు ముఖేష్, రియాజ్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. అలాగే మరికొందరు నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కోన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి ఉష తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్ లాల్ తో కలిసి సినిమా చేసిన రోజులలో ఓ ఘటన ఎదుర్కొన్నానని తెలిపింది.

Tollywood: లిఫ్టులో నటుడు అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన హీరోయిన్.. ఆ తర్వాత..
Usha
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2024 | 8:05 AM

Share

సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులను హేమ కమిటీ బయటపెట్టింది. రంగుల ప్రపంచంలో అతివలను వేధిస్తోన్న రాక్షసులు ఎందరో అంటూ హేమ కమిటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది. మలయాళం ఇండస్ట్రీలోని స్టార్ నటుల చేతిలో చితికిన చిన్న నటీమణుల జీవితాలను.. వారిపై జరిగిన దాడుల గురించి తెలిసి అంతా అవాక్కవుతున్నారు. వెండితెర వెనక దాగిన రాక్షస చర్యల గురించి తెలిసి షాకవుతున్నారు. హేమ కమిటీ నివేదిక తర్వాత చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు ముఖేష్, రియాజ్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. అలాగే మరికొందరు నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కోన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి ఉష తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్ లాల్ తో కలిసి సినిమా చేసిన రోజులలో ఓ ఘటన ఎదుర్కొన్నానని తెలిపింది.

“ఆ సినిమా షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ మొత్తం బహ్రెయిన్ వెళ్లాం.. అక్కడ షో పూర్తికాగానే అందరం తిరుగు ప్రయాణానికి రెడీ కావాలని.. లగేజ్ మొత్తం తెచ్చుకోవాలని మోహన్ లాల్ చెప్పారు. నేను గదిలోని నా వస్తువులు సర్దుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నారు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అతడి చెంప చెళ్లమనిపించాను. మలయాళ సినీ పరిశ్రమలో అతడు ఎంతో మంది అభిమానించే నటుడు. అలాంటి వ్యక్తి ప్రవర్తన అసలు ఊహించలేదు. ఈ మాట మోహన్ లాల్ కు చెప్తే మంచి పని చేశావన్నాడు. కానీ ఆ ఘటన తర్వాత నాకు పొగరు అని అన్నారు చాలా మంది.

ఆ ఘటన తర్వాత నాకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. నాతో అసభ్యకరంగా ప్రవర్తిన ఆ మనిషి ఇప్పుడు జీవించిలేడు. అందుకే అతడి పేరు చెప్పదల్చుకోలేదు. ఇప్పుడెందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పాను. ఆ వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అందుకే మరోసారి క్లారిటీ ఇస్తున్నాను.” అంటూ చెప్పుకచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us